AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ‘మేమంతా సిద్దం’ తొలి బహిరంగ సభలో సీఎం జగన్.. ఏమన్నారంటే..

ఏపీ రాజకీయాల్లో హీటెక్కించే ప్రచారానికి శంఖం పూరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర వేంపల్లి, వీరపునాయపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంది.

YSRCP: 'మేమంతా సిద్దం' తొలి బహిరంగ సభలో సీఎం జగన్.. ఏమన్నారంటే..
Cm Ys Jagan
Srikar T
|

Updated on: Mar 27, 2024 | 10:34 PM

Share

ఏపీ రాజకీయాల్లో హీటెక్కించే ప్రచారానికి శంఖం పూరించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రను ఇడుపులపాయ నుంచి ప్రారంభించారు. ఈ యాత్ర వేంపల్లి, వీరపునాయపల్లి, ఉరుటూరు, యర్రగుంట్ల, పోట్లదుర్తి మీదుగా ప్రొద్దుటూరు చేరుకుంది. యాత్రలో పలువురిని కలుసుకుంటూ వారితో మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగారు. ప్రొద్దుటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ తన ప్రభుత్వంలో జరిగిన మేలు గురించి ప్రజలకు వివరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన టార్గెట్‌ 175 సీట్లు అన్నారు. లోక్ సభ స్థానాల్లో మన టార్గెట్‌ 25కి 25 ఎంపీ సీట్లు అని పేర్కొన్నారు. అందుకు మీరు సిద్ధమా అని అడుగుతున్నానన్నారు. దుష్టచతుష్టయాన్ని ఎదుర్కొనేందుకు నేను సిద్ధం అన్నారు. నన్ను గెలిపించడానికి మీరు సిద్ధమా? అని ప్రజలను అడిగారు. మేము సిద్ధం అంటూ ప్రొద్దుటూరు వేదికగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. కడప జిల్లా ప్రజలు నన్ను బిడ్డలా చూసుకున్నారు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు అన్నారు సీఎం జగన్.

బహిరంగసభ వీడియో..

నాపై ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబును తిట్టిన పార్టీలతో.. ఏమాత్రం సిగ్గులేకుండా పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. అబద్ధాలు, మోసాలు చేసేవారు మనకు పోటీగా ఉన్నారని.. మన ప్రత్యర్థిగా కుట్రలు చేసే కూటమి ఉందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మేనిఫెస్టో గుర్తుంటుంది కానీ ఎన్నికలు కాగానే మేనిఫెస్టో చెత్తబుట్టలో వేస్తారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. కానీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మీ కోసం 130 సార్లు బటన్‌లు నొక్కాను అయితే ప్రజలు రెండు బటన్లు నొక్కాలన్నారు. ఒకటి అసెంబ్లీ, మరొకటి పార్లమెంట్‌ బటన్ అని గుర్తు చేశారు. నేను దేవుడు, ప్రజలను నమ్ముకున్నా మంచిచేసే ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్నారని తెలిపారు.

ఇవి కూడా చదవండి

వైఎస్ జగన్ బస్సు యాత్ర విజువల్స్..

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశామన్నారు. అలాగే రూ.3 వేల పెన్షన్‌ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం తీసుకొచ్చాం.. గ్రామస్థాయిలో ఆర్బీకేలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 80శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. అలాగే డీటీబి ద్వారా రూ.లక్షా 90 వేల కోట్లు మహిళలకు లబ్ధిచేకూరిందని వివరించారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. రూ. 10 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచామని చెప్పారు. రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. కరోనా వల్ల రాష్ట్రానికి ఆదాయం తగ్గినా పథకాలు ఆపలేదని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు మీకు అందిఉంటే మరోసారి వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి గెలిపించమని ప్రొద్దుటూరు సభ నుంచి ప్రజలను కోరారు వైఎస్ జగన్.

పూర్తి వీడియో..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..