Turtles: ఏపీలో 396 తాబేళ్ల అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్

విశాఖపట్నంలో బతికున్న తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. డీఆర్ఐ అధికారులు విశాఖ రైల్వేస్టేషన్ లో నిఘా పెట్టి వన్యప్రాణులను గుర్తించారు. నిందితులైన ఇద్దరు ప్రయాణికులు షాలిమార్ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు.

Turtles: ఏపీలో 396 తాబేళ్ల అక్రమ రవాణా.. ఇద్దరు అరెస్ట్
Turtiles
Follow us

|

Updated on: Mar 27, 2024 | 9:30 PM

విశాఖపట్నంలో బతికున్న తాబేళ్లను అక్రమంగా తరలిస్తున్న వారిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. డీఆర్ఐ అధికారులు విశాఖ రైల్వేస్టేషన్ లో నిఘా పెట్టి వన్యప్రాణులను గుర్తించారు. నిందితులైన ఇద్దరు ప్రయాణికులు షాలిమార్ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు. విచారణలో వారి వద్ద 396 తాబేళ్లు ఉన్నట్లు తేలింది. ఇవి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నేరం. నిందితులను అదుపులోకి తీసుకొని విచారంగా, పలు కీలక విషయాలు బయటకు వచ్చాయి.

వారి వద్ద అనేక రకాల తాబేళ్లు లభించాయి. 396 తాబేళ్లలో ఎన్నో రకాలు ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. అయితే ఈ తాబేళ్లను పశ్చిమబెంగాల్ నుంచి తెప్పించి చెన్నైకి తరలించారు. బతికున్న తాబేళ్లను వెంటనే స్వాధీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం అటవీ అధికారులకు అప్పగించారు.

తాబేళ్ల గురించి ఆసక్తికర విషయాలు

తాబేళ్లు ప్రపంచంలోని పురాతన సరీసృపాల సమూహాలలో ఒకటి.  ఈ జీవులు 200 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్ల కాలం నాటివి.  తాబేలు ఏం తింటుందనేది అది నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. భూమిలో నివసించే తాబేళ్లు పండ్లు, గడ్డిని తింటాయి, అయితే సముద్రవాసులు ఆల్గే నుండి స్క్విడ్, జెల్లీ ఫిష్ వరకు ప్రతిదాన్ని తింటారు. కొన్ని తాబేళ్లు మాంసాహారులు , మరికొన్ని శాకాహారులు ఉంటాయి. మరికొన్ని సర్వభక్షకులు రెండింటిని ఆహారంగా తీసుకుంటాయి. ఇక  తాబేళ్లలో ‘అమ్నియోట్స్’ లాంటి అవి గాలిని పీల్చుకుంటాయి. భూమిపై గుడ్లు పెడతాయి అయినప్పటికీ అనేక జాతులు నీటిలో లేదా చుట్టుపక్కల నివసిస్తాయి. ఇవి జీవ వైవిధ్యంలో కాపాడటంలో ముందు ఉంటాయి.