- Telugu News Photo Gallery Chandrababu election campaign started, Big response to Prajagalam public meeting
AP TDP: ఎన్నికల ప్రచారంలోకి చంద్రబాబు.. ప్రజాగళం బహిరంగ సభకు బిగ్ రెస్పాన్స్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలోకి దిగాయి. టీడీపీ ప్రజాగళం పేరుతో దూసుకుపోతుండగా, వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో రాజకీయ సభలను హీటెక్కిస్తున్నాయి.
Updated on: Mar 27, 2024 | 7:41 PM

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలు ప్రచార పర్వంలోకి దిగాయి. టీడీపీ ప్రజాగళం పేరుతో దూసుకుపోతుండగా, వైసీపీ మేమంతా సిద్ధం పేరుతో రాజకీయ సభలను హీటెక్కిస్తున్నాయి.

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజాగళం సభ ను నిర్వహించారు. నగరి నియోజకవర్గం, పుత్తూరులో ప్రజాగళం బహిరంగ సభ జరిగింది. టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ కూటమి 160 సీట్లు గెలుచుకుంటుందని, త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్ లో మహిళా సాధికారత తమ పార్టీతోనే సాధ్యమని, తమ ప్రభుత్వం అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలను అధికార వైసీపీ రద్దు చేసిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.

మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగయ్యేలా తాను అండగా ఉంటానని, ఏపీలో ఉత్తమ పాలన కొనసాగాలంటే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి ఓటు వేయాలని కోరారు.