AP News: తమ్ముడి టికెట్ కోసం అన్న త్యాగం చేస్తున్నారా.. ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి ఎవరు..
జనసేన పార్టీకి బాపట్లజిల్లా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి స్వాములు షాక్ ఇచ్చారు. చీరాల సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని స్వాములు చెబుతున్నారు. జనసేన నుంచి ప్రకాశంజిల్లా గిద్దలూరు టికెట్‌ను స్వాములు ఆశించారు. ఈ మేరకు పార్టీలో చేరే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా తనకు గిద్దలూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

జనసేన పార్టీకి బాపట్లజిల్లా చీరాల నియోజకవర్గ సమన్వయకర్త ఆమంచి స్వాములు షాక్ ఇచ్చారు. చీరాల సమన్వయకర్త పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే పార్టీలో సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని స్వాములు చెబుతున్నారు. జనసేన నుంచి ప్రకాశంజిల్లా గిద్దలూరు టికెట్‌ను స్వాములు ఆశించారు. ఈ మేరకు పార్టీలో చేరే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కూడా తనకు గిద్దలూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆ తరువాత గిద్దలూరులో జరిగిన పలు జనసేన కార్యక్రమాల్లో ఆమంచి స్వాములు పాల్గొంటూ వచ్చారు. అయితే అధిష్టానం మాత్రం తన స్వంత నియోజకవర్గంగా ఉన్న బాపట్లజిల్లా చీరాల పార్టీ సమన్వయకర్తగా ఆమంచి స్వాములును నియమించింది. మరోవైపు చీరాల నుంచి ఇండిపెండెంట్‌గా లేదా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆమంచి స్వాములు తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఏర్పాట్లు చేసుకుంటున్న నేపధ్యంలో తాను కూడా చీరాల నుంచి పోటీచేసేందుకు ఆమంచి స్వాములు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ నేపథ్యంలో తనను గిద్దలూరు సమన్వయకర్తగా నియమించి అక్కడి నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పలుమార్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే అధిష్టానం నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో తన చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తూ పార్టీ అధినాయకత్వానికి స్వాములు లేఖ రాశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. స్వాములు చీరాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
తమ్ముడికోసం అన్న త్యాగం చేశారా..
ఉమ్మడి ప్రకాశంజిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే.. టక్కున ఆమంచి బ్రదర్స్ గుర్తుకొస్తారు. నిన్నటి వరకు అన్నదమ్ముల అనుబంధంగా ఉన్న వీరిద్దరి మధ్య సంబంధాలను ఇప్పడు రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. వీరిబంధానికి బ్రేక్ పడటానికి ఆధిపత్యపోరు ఆజ్యం పోసింది. దీంతో మీకు మీరే.. మాకు మేమే అంటూ ఆమంచి బ్రదర్స్ ఎవరికివారు కొంతకాలంగా రాజకీయాలు చేస్తున్నారు. నిన్నటి వరకు చీరాల మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ తాజాగా పర్చూరు వైసిపి ఇన్‌చార్జిగా ఉంటూ అక్కడి నుంచి పోటీ చేయనని, తనకు చీరాల వైసిపి టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. అయితే అధిష్టానం అందుకు నిరాకరించడంతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా తన స్వంత నియోజకవర్గం చీరాలలోనే ఉండిపోయారు. చీరాల నుంచి మరే ఇతర పార్టీ నుంచి కానీ, ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఈ పరిస్థితుల్లో తాను చీరాల జనసేన సమన్వయకర్తగా ఉంటూ తమ్ముడు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందన్న భావనతో ఉన్నారు. అన్న ఆమంచి స్వాములు.. అందుకు ప్రత్యామ్నాయంగా తనకు గిద్దలూరు టికెట్ కేటాయించాలని గత కొంతకాలంగా జనసేన అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. అయితే అధిష్టానం పట్టించుకోకపోవడంతో చీరాల జనసేన సమన్వయ కర్తగా ఉండటం ఇష్టంలేక ఆ పదవికి ఆమంచి స్వాములు రాజీనామా చేశారు. అయితే పార్టీలోనే కొనసాగుతానని, పార్టీకి సేవ చేస్తానని ఆమంచి స్వాములు చెబుతున్నారు. దీంతో తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కోసం అన్న ఆమంచి స్వాములు త్యాగం చేస్తున్నారన్న చర్చ చీరాలలో జోరుగా నడుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








