AP Assembly Election 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు..? ఎలక్షన్ కు సంబంధించిన ఆసక్తికర అంశాలు
Andhra Pradesh Assembly Election: ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థులపై ఎంపిక కసరత్తులు, గెలుపు వ్యూహాలపై చర్చలు, సభలు, సమావేశాలతో హోరెతిస్తున్నాయి. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కీలక ప్రకటన చేయడంతో అసెంబ్లీ ఎన్నికల తేదీలు చర్చనీయాంశమవుతున్నాయి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఎన్నికల మోడ్ లోకి వెళ్లిపోయాయి. అభ్యర్థులపై ఎంపిక కసరత్తులు, గెలుపు వ్యూహాలపై చర్చలు, సభలు, సమావేశాలతో హోరెతిస్తున్నాయి. అయితే మిగత రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరుకుంది. అయితే ఇటీవల సీఎం జగన్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై కీలక ప్రకటన చేయడంతో అసెంబ్లీ ఎన్నికల తేదీలు చర్చనీయాంశమవుతున్నాయి. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఎనిమిది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు 2024లో సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. 175 మంది సభ్యులున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గంటా శ్రీనివాస్ రావు రాజీనామా ఆమోదం పొందడంతో అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, టీడీపీకి 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించడంతో ఆ సంఖ్య 19కి తగ్గింది. 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదిహేనవ శాసనసభను ఏర్పాటు చేయడానికి 2019 ఏప్రిల్ 11 న శాసనసభ ఎన్నికలు జరిగాయి. అవి 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి. 2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గురించి కీలక విషయాలు మీకోసం..
ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి?
2024 లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఖచ్చితమైన తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే 2024 మే లోపు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన ప్రకటన ఆధారంగా 2024 ఏప్రిల్ జరిగే అవకాశాలు ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీలు, అభ్యర్థులు ప్రజాతీర్పు కోసం పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుత శాసనసభ పదవీకాలం 2024 ఏప్రిల్ లో ముగియనుండటంతో ఈ ఎన్నికలు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలకు కీలకంగా మారాయి.
ప్రస్తుత ఏపీ రాజకీయ చిత్రం
గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలు టిడిపి, వైసిపి, జనసేన బరిలో దిగగా, మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ 151, టీడీపీ 23 స్థానాల్లో విజయం సాధించాయి. జనసేన పార్టీ ఒక సీటు గెలుచుకోగా, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ నేపథ్యంలో రెండోసారి సీఎం జగన్ అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో ఈమారు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగే అవకాశాలున్నాయి.
అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ-జనసేన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం ప్రకటించారు. ఒకవేళ బీజేపీ పార్టీ కూటమిలో చేరాలని నిర్ణయిస్తే బీజేపీకి చోటు కల్పించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు చేసినట్లు ఇరువురు నేతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలను ద్రుష్టిలో పెట్టుకొని ప్రధాన పార్టీలు గెలుపే ధ్యేయంగా ఇప్పట్నుంచే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో ఏపీ ఓటరు ఎవరికి అధికారం కట్టబెడుతారనేది వేచి చూడాల్సిందే..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



