AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఎవరిదో తెలుసా? భారత స్థానం ఎంతంటే?

రష్యాపై డ్రోన్ దాడి జరిగిందని పోలాండ్ ఆరోపణలు.. ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడి చేసినట్లు అరబ్.. యూరప్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 140 దేశాల సైన్యాల ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఎవరు అని ర్యాంకింగ్ జాబితా వెలువడింది.

ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైనిక శక్తి ఎవరిదో తెలుసా? భారత స్థానం ఎంతంటే?
Global Firepower Index
Balaraju Goud
|

Updated on: Sep 14, 2025 | 11:17 AM

Share

రష్యాపై డ్రోన్ దాడి జరిగిందని పోలాండ్ ఆరోపణలు.. ఖతార్‌పై ఇజ్రాయెల్ ఇటీవల వైమానిక దాడి చేసినట్లు అరబ్.. యూరప్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల మధ్య, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 140 దేశాల సైన్యాల ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి ఎవరు అని ర్యాంకింగ్ జాబితా వెలువడింది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్‌లో అమెరికా ఆధిపత్యం 2025లో కూడా కొనసాగుతోంది. భారతదేశం టాప్-5లోకి చేరింది. ఇక దాయాది పాకిస్తాన్ టాప్-10 వెలుపల కనిపించింది.

ఈ సూచికలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా అవతరించింది. అమెరికా ప్రపంచంలోనే రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేస్తుంది. అమెరికా ఆధునిక ఆయుధాలను భారీగా నిల్వ చేసుకుంటోంది. నాటో దేశాలు, అరబ్ దేశాలు సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న యుఎస్ ఆర్మీ సైనిక స్థావరాలు కూడా తన బలాన్ని చూపిస్తున్నాయి. అమెరికాలో కూడా అణ్వాయుధాల భారీ నిల్వ ఉంది.

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ (GFP) లో రష్యా.. అమెరికా తర్వాత స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద సైనిక శక్తిగా రష్యా నిలిచింది. దీని తరువాత, చైనా ప్రపంచంలో మూడవ అతిపెద్ద సైనిక శక్తి, ఆసియాలో అతిపెద్దదిగా అవతరించింది. భారతదేశం.. చైనా తర్వాత స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారతదేశం నాల్గవ స్థానంలో సంపాదించుకుంది. దక్షిణ కొరియా ఐదవ స్థానంలో కొనసాగుతోంది.

టాప్-10 దేశాల గురించి మాట్లాడుకుంటే, UK ఆరో స్థానంలో, ఫ్రాన్స్ ఏడో స్థానంలో, జపాన్ ఎనిమిదో స్థానంలో, టర్కీ తొమ్మిదో స్థానంలో, ఇటలీ పదవ స్థానంలో ఉన్నాయి. 2024లో తొమ్మిదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ 2025లో 12వ స్థానానికి దిగజారింది. ఇటీవలి నెలల్లో నిత్యం చర్చలో ఉన్న ఇరాన్, ఇండెక్స్‌లో 16వ స్థానంలో నిలిచింది. ఇజ్రాయెల్ 15వ స్థానంలో కొనసాగుతోంది.

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ అనేది దేశాల రక్షణ బడ్జెట్, సాంకేతికత, దళాల సంఖ్య, ప్రపంచ పరిధి ఆధారంగా అత్యంత శక్తివంతమైన సైన్యాల ర్యాంకింగ్ నిర్ణయిస్తుంది. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం పెరిగింది. ప్రభుత్వాలు సైనిక ఆధునీకరణ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, అనేక దేశాలు తమ ర్యాంకింగ్‌ను వేగంగా మెరుగుపరుచుకుంటున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..