AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup – IND vs PAK: : పాక్‌తో భారత్‌ క్రికెట్ ఆడటాన్ని మీరు సమర్థిస్తారా?

ఆటలో గెలవాలంటే ఒకరిద్దరి వల్ల కాదు. పైగా క్రికెట్‌లో అది కుదరని పని. అందరూ ఐక్యంగా రాణించాల్సిందే. సమస్ఠిగా సత్తా చాటాలంటే నడిపించే నాయకుడు కావాలి. అలాంటి నాయకుల ప్రతిభా పాటవాల కారణంగానే టీమిండియా.. ఏకంగా 8 సార్లు ఆసియా కప్‌ సాధించింది. ఆ సమర్థవంతమైన కెప్టెన్లు ఎవరు? ఏ టైమ్‌లో ఎన్ని ట్రోఫీలు అందించారు?

Asia Cup - IND vs PAK: : పాక్‌తో భారత్‌ క్రికెట్ ఆడటాన్ని మీరు సమర్థిస్తారా?
Pm Modi In Assam
Balaraju Goud
| Edited By: Ram Naramaneni|

Updated on: Sep 14, 2025 | 3:00 PM

Share

ఆసియా కప్ 1984లో ఆరంభమైంది. అప్పటినుంచి భారత్ హవా కొనసాగుతూ వస్తోంది. ఇప్పటిదాకా జరిగిన 16 ఎడిషన్లలో 8సార్లు టైటిల్ గెల్చుకుంది. ఇది గెలుపు మాత్రమే కాదూ.. టీమ్‌ను ముందుండి నడిపిన కెప్టెన్ల కృషికి నిదర్శనం. ప్రతి టైమ్ లైన్‌లో ప్రతి కెప్టెన్‌ తనదైన శైలితో జట్టుని గెలిపించడం భారత క్రికెట్ చరిత్రలో ఒక స్పెషల్ చాప్టర్‌. ఆసియా కప్‌లో ఇప్పటిదాకా భారత్‌కు ఐదుగురు కెప్టెన్లు టైటిల్స్ అందించారు.

1984లో షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్‌లో భారత్‌కు సునీల్ గవాస్కర్ నాయకత్వం వహించారు. అప్పట్లో కేవలం మూడే టీమ్స్ పాల్గొన్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక. భారత జట్టు పాక్‌పై 54 పరుగులు తేడాతో గెలిచి టైటిల్ కైవసం చేసుకుంది. ఇది ట్రోఫీ మాత్రమే కాదూ.. భారత్ ఆధిపత్యానికి బలమైన ఆరంభమని చెప్పాలి. గవాస్కర్‌ ప్రశాంత స్వభావం.. క్రమశిక్షణ.. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టులో కాన్ఫిడెంట్‌ నింపారు. మొదటి కెప్టెన్‌గా ఆసియా కప్‌ ట్రోఫీని లిఫ్ట్ చేసిన ఘనత గవాస్కర్‌కి దక్కింది.

1988లో ఆసియా కప్‌లో రెండోసారి విజేతగా నిలిచింది భారత్‌. అప్పుడు కెప్టెన్‌గా ఉన్నారు దిలీప్ వెంగ్‌సర్కార్‌. ఆయన కెప్టెన్సీ కాలంలో టీమిండియా పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఆసియా కప్‌లో మాత్రం విజయం సాధించారు. ఆ విజయం ఆయన కెరీర్‌లోనే మధురమైన ఘట్టం. శ్రీలంక, పాక్‌ జట్లతో పోటీ పడుతూ టీమ్‌ను సమర్థవంతంగా ముందుకు నడిపించారు. ఈ గెలుపు భారత జట్టు క్రమంగా ఆసియా క్రికెట్‌లో అగ్రస్థానంలో నిలిచే దిశగా ఒక కీలక మైలురాయిగా నిలిచింది. వెంగ్‌సర్కార్‌ ఆత్మ విశ్వాసం.. జట్టుని ప్రోత్సహింతే తీరు ప్రత్యేకంగా నిలిచాయి.

1990, 1995లో భారత్ రెండుసార్లు ఆసియా కప్‌ ట్రోఫి గెల్చుకుంది. ఈ రెండు విజయాలకు కెప్టెన్‌గా ఉన్నారు అజారుద్దీన్. ప్రత్యేకంగా షార్జాలో జరిగిన ఫైనల్లో 90 పరుగులతో నాటౌట్‌గా ఉండి జట్టుని విజేతగా నిలిపారు అజారుద్దీన్‌. ఆ మ్యాచ్‌లో సిద్దూతో కలిసి చేసిన 175 పరుగుల భాగస్వామ్యం అభిమానుల మదిలో నిలిచిపోయింది. ఆజార్ నాయకత్వంలో భారత్.. ఆసియా క్రికెట్‌లో పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఆయన కెప్టెన్సీ కాలంలో టీమ్ మరింత స్ట్రాంగ్‌గా మారి అద్భుతమైన విజయాలను అందుకుంది.

భారత క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్‌ ఫుల్ కెప్టెన్లలో మహేందర్ సింగ్ ధోనీ ఒకరు. 2010లో దంబుల్లాలో శ్రీలంకపై భారత్ విజయం సాధించి ఆసియా కప్ ట్రోఫీ గెల్చుకుంది. ఆ తర్వాత 2016లో మీర్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాపై గెలిచి మరోసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ సారి మ్యాచ్ టీట్వంటీ ఫార్మాట్‌లో జరిగింది. అందుకే ధోనీ వన్డే, టీ2- ఫార్మాట్లలో ఆసియా కప్ గెలిపించిన ఏకైక భారత కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు. ధోనీ కెప్టెన్సీలో డిసిప్లేన్‌, కరేజ్‌, స్మార్ట్ డెసిషన్‌తో భారత్‌ ఎన్నో విజయాలు అందుకుంది. ధోనీ నిర్ణయాలు ఇప్పటికీ హాట్ టాపికే.

2018లో బంగ్లాపై ఉత్కంఠభరితమైన ఫైనల్లో భారత్ టైటిల్‌ సాధించింది. ఆ టైమ్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ టీమ్‌ని ముందుండి నడిపాడు. 2023లో శ్రీలంకపై విజయం సాధించినప్పుడు మాత్రం పూర్తి అధికారిక కెప్టెన్‌గా ట్రోఫీ లిఫ్ట్ చేశాడు. ఆ ఫైనల్‌లో భారత్ అద్భుత ప్రదర్శనతో శ్రీలంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 6.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆసియా కప్ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ విజయంగా నిలిచింది. రోహిత్ తన కూల్ కెప్టెన్సీతో గెలిపించడం ద్వారా ఒకటి అంతకంటే ఎక్కువసార్లు భారత్‌కు ఆసియాకప్ టైటిల్ అందించిన ధోనీ, అజార్ పక్కన నిలిచాడు.

ఇప్పటిదాకా ఈ ఐదుగురు కెప్టెన్లు టీమిండియాకు ఆసియా కప్ టైటిల్‌ను అందించారు. మరిప్పుడు బలమైన జట్టుతో భారత్ బరిలోకి దిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. సూర్యకుమార్ కూడా ఈ జాబితాలో చేరడం ఖాయమేనా? భారత్ టైటిల్ గెలిస్తే.. సూర్య పేరు కూడా గవాస్కర్‌, వెంగ్‌సర్కార్‌, అజార్‌, ధోనీ, రోహిత్‌లతో పాటు నిలుస్తుంది. అభిమానులంతా సూర్య కెప్టెన్సీలో టీమిండియా కప్ గెలుస్తుందని ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 14 Sep 2025 01:46 PM (IST)

    స్వదేశీ వస్తువులను మాత్రమే కొనండిః ప్రధాని మోదీ

    భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండవ రోజు పర్యటిస్తున్నారు. ఆదివారం (సెప్టెంబర్ 14) అస్సాంలో 19,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, ఈ ఏడాది పండుగ సీజన్‌ను స్వదేశీ వస్తువులతో చేసుకోవాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కంపెనీ ఏ దేశానికి చెందినదైనా, ఏ దేశ పేరు అయినా, కానీ, భారతదేశంలో తయారైన వస్తువులను మాత్రమే కొనాలని ప్రధాని అన్నారు.

  • 14 Sep 2025 12:44 PM (IST)

    కాలువలో పడి రెండేళ్ల బాలుడు గల్లంతు

    పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నకరికల్లు మండలం కుంకులగుంటలో కాలువలో పడిన రెండు ఏళ్ళ బాలుడు గల్లంతయ్యాడు. శనివారం కురిసిన భారీ వర్షాలకు కాలువ పొంగి పొర్లుతోంది. షేక్ ఈషాన్ అహమ్మద్ అనే బాలుడిని అరుగుపై కూర్చోబెట్టి ఇంట్లో పని చేసుకుంటోంది తల్లి. బయట అరుగుపైన కూర్చొని ఉండగా ప్రమాదవశాత్తు సైడ్ కాలువలో పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. బాలుడి కోసం స్థానికులతో కలిసి గాలింపు చేపట్టారు. దీంతో కుంకలగుంట రైల్వే స్టేషన్ వద్ద గల పంట కాలువలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు.

  • 14 Sep 2025 12:37 PM (IST)

    ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. యువ మారథాన్

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని నేషనల్ స్టేడియం–ఇండియా గేట్ వద్ద గాంధీ స్మృతి ఆధ్వర్యంలో యువా మారథాన్ నిర్వహించారు. ఈ మారథాన్‌కు పద్మ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, గాంధీ స్మృతి వైస్ చైర్మన్ విజయ్ గోయెల్ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. “గాంధీకి సోచ్ – మోదీ కా జోష్” అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

  • 14 Sep 2025 12:34 PM (IST)

    నల్లమలకు విచ్చేసిన విశిష్ట అతిధులు..!

    సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నుంచి 66 కృష్ణ జింకలు, ఆరు చుక్కల దుప్పులను తీసుకొచ్చిన అటవీ అధికారులు నలమల అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆత్మకూరు అటవీ డివిజన్ లోని రుద్రకోడూరు సెక్షన్ లో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఎన్ క్లోజర్ లోకి పంపించారు. స్థానిక వాతావరణానికి అలవాటు పడిన తర్వాత జింకలను ఆడవిలో వదిలిపెట్టనున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. NSTR లో మాంసాహార జంతువులు, గడ్డిమేసే జంతువుల నిష్పత్తిలో తేడాను సవరించేందుకు కృష్ణ జింకలను తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

  • 14 Sep 2025 12:30 PM (IST)

    పులి సంచారంతో భయం గుప్పిట జనం

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి పులి సంచారం హడలెత్తించింది. తిర్యాని,దేవాపూర్ మండలాల సరిహద్దు అబ్బాపూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంత సమీపంలో పులి అడుగులు రైతులు గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. పులి సంచారం నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

  • 14 Sep 2025 11:46 AM (IST)

    మేధా స్కూల్‌లో డ్రగ్స్‌ తయారీ కేసులో సంచలనాలు

    మేధా స్కూల్‌లో డ్రగ్స్‌ తయారీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈగల్ టీమ్ అధికారులు. స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్‌ను విచారిస్తున్నారు. ఏడాది నుంచి మేధా స్కూల్‌లో అల్ప్రాజోలం తయారు చేస్తూ.. మహబూబ్‌నగర్ భూత్పూర్‌‌కు ఆల్ఫాజోలం తరలిస్తున్నట్లు గుర్తించారు. గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి ఫార్ములా కొనుగోలు చేసిన జయప్రకాష్‌, మేధ స్కూల్ అడ్డాగా చేసుకుని దందా కొనసాగిస్తున్నాడు. అల్ప్రాజోలంను తయారు చేసిన కల్లు దుకాణాలకు అమ్ముతున్నాడు జయప్రకాష్‌. ఈ కేసులో ఇప్పటివరకు కేసులో నలుగురిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. గురువారెడ్డిని కూడా నిందితుడిగా చేర్చనున్నారు.

  • 14 Sep 2025 11:43 AM (IST)

    సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దు

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన రద్దు అయ్యింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయినట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో మహిళా సాధికారత సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే అమరావతి-తిరుపతి మధ్య దట్టమైన మేఘాలు అలముకొని ఉండటంతో ఏవియేషన్‌ అధికారులు క్లియరెన్స్‌ ఇవ్వలేదు. దీంతో పర్యటన రద్దయినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది..

  • 14 Sep 2025 11:40 AM (IST)

    తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..!

    నేడు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలోని ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిరిసిల్లా, కరీంనగర్, ములుగు, కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముంది. మిగిలిన అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇక, ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది అమరావతి వాతావరణ శాఖ. దక్షిణకోస్తా, తిరుపతిలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

  • 14 Sep 2025 09:58 AM (IST)

    సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

    ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతోంది. పెనుబల్లి మండలం లంకా సాగర్ ప్రాజెక్ట్ పొంగిపొర్లుతుంది. ఎనిమిది అడుగుల మేర అలుగు పడి వరద నీరు ప్రవహిస్తుంది. సత్తుపల్లి మండలం బేతుపల్లి ప్రాజెక్ట్‌ ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌కు చేరింది. బేతుపల్లి ప్రాజెక్ట్‌కు కూడా అలుగు పడి పొంగి ప్రవహిస్తుంది. సత్తుపల్లి మండలంలోని తుంబూరు దగ్గర తమ్మిలేరు వాగుకు వరద నీరు భారీగా వస్తుంది. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ్మిలేరు వాగుకు భారీగా వరద వస్తుండటంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లోకి వరదనీరు వచ్చి చేరింది. మరోవైపు వర్షం కారణంగా 30 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

  • 14 Sep 2025 09:21 AM (IST)

    వైద్య సిబ్బంది సాహసోపేతంగా సేవలు

    పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సాహసోపేతంగా సేవలు అందిస్తున్నారు. నడుముల్లోతు నీళ్లలో ఏరు దాటి గిరిజన గ్రామాలకు వెళ్లి సేవలు అందించారు ANM సావిత్రి, ఇతర సిబ్బంది. భారీ వర్షాలకు ఏరు పొంగి ప్రవహిస్తున్నా.. భయపడకుండా టీకాలు వేసేందుకు వెళ్లారు. దీంతో వైద్య సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.

  • 14 Sep 2025 09:11 AM (IST)

    లండన్‌లో రోడ్లపైకి వచ్చిన లక్షలాది మంది జనం

    బ్రిటన్‌లో లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చారు. యాంటీ ఇమిగ్రేషన్‌ పేరు భారీ ర్యాలీ నిర్వహించింది. అదే సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా మరో నిరసన కార్యక్రమం చేపట్టా. ఈ క్రమంలో పోలీసులపై ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. శనివారం సెంట్రల్‌ లండన్‌లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దదని మెట్రోపాలిటన్‌ పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంచీనయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో పోలీసులపైకి వాటర్‌ బాటిళ్లు, వస్తువులతో ఆందోళనకారులు దాడులు చేశారు. ఈ ఘటనలో 26 మంది అధికారులు గాయపడ్డారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

  • 14 Sep 2025 07:52 AM (IST)

    పట్టపగలు యువతిని కాల్చి చంపిన ప్రియుడు

    మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గ్వాలియర్‌లో పట్టపగలు యువతిని తుపాకీతో కాల్చి చంపాడు ప్రియుడు. స్థానిక రూప్‌సింగ్‌ స్టేడియం ఎదుట అరవింద్‌ అనే తనతో సహజీవనం చేసిన నందిని (28)ని తుపాకితో కాల్చి చంపాడు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గత కొంతకాలంగా విడిగా ఉంటున్నారు. అరవింద్‌తో తనకు ప్రాణభయం ఉందని ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా అరవింద్‌ అడ్డుకుని కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. నిందితుడు పక్కనే తుపాకీ పట్టుకొని కూర్చోవడం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు పోలీసులు.

  • 14 Sep 2025 07:46 AM (IST)

    చరిత్ర సృష్టించిన భారత బాక్సర్

    ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం దక్కింది. జైస్మీన్‌ లాంబోరియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. లివర్‌పుల్‌లో మహిళల 57 కిలోల విభాగంలో జరిగిన పోటీలో ఆమె స్వర్ణం సాధించారు. భారత్‌ తరఫున మీనాక్షి హుడా, నుపుర్‌ షెరోన్‌ పైన ఇప్పటికే తుదిపోరుకు అర్హత సాధించారు. పురుషుల విభాగంలో భారత్‌ ఒక్క పతకం లేకుండానే పోటీని నిష్కమించింది.

  • 14 Sep 2025 07:29 AM (IST)

    అర్థరాత్రి ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

    నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో MLA బొజ్జు పటేల్ ప్రత్యేక్షమయ్యారు. అర్థరాత్రి వేళలో ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేశారు. పేషెంట్‌కు అందుతున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది అన్ని విధాలుగా పేషెంట్లకు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రి లో ఫార్మసీని తనిఖీ చేసిన ఎమ్మెల్యే.. కాలం చెల్లిన మందులు ఉన్నాయా అని వాటిని పరిశీలించారు.

  • 14 Sep 2025 07:06 AM (IST)

    రెండున్నరేళ్ల కొడుకును చంపి మూసీలో పడేసిన తండ్రి

    అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి కొన్నాళ్లుగా నీలోఫర్‌లో చికిత్స చేయిస్తున్నారు. పండ్ల వ్యాపారి అయిన తండ్రి.. ఈ నెల 12న మరోసారి ఆస్పత్రికి తీసుకెళ్లి వచ్చాడు. ఏం జరిగిందో అదే రోజు తెల్లవారుజామున బాలుడ్ని గొంతునులిమి చంపి.. నయాపూల్ బ్రిడ్జిపై నుంచి మూసీలో విసిరేశాడు. బాలుడు లేడని వెతికిన బంధువులు.. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. తండ్రి తమదైన స్టైల్‌లో ప్రశ్నిస్తే.. నిజం ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

Published On - Sep 14,2025 6:55 AM