Telugu News Trending Birds hunting fish video was gone viral in social media Telugu news
Video Viral: రాజమౌళి సినిమా గ్రాఫిక్స్ ను మించిపోయిన వీడియో.. చూస్తే షాక్ అవ్వాల్సిందే.. సోషల్ మీడియాలో వైరల్
సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఏమిటి. దాన్ని ఎలా వాడతారు. అందులో విషయాలు ఎలా వైరల్ అవుతాయి వంటి విషయాలపై అంతగా అవగాహన...
సోషల్ మీడియా యుగంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు సోషల్ మీడియా అంటే ఏమిటి. దాన్ని ఎలా వాడతారు. అందులో విషయాలు ఎలా వైరల్ అవుతాయి వంటి విషయాలపై అంతగా అవగాహన ఉండేది కాదు. కానీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో క్షణాల వ్యవధిలోనే వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఫన్నీ, స్టంట్స్, డాన్సింగ్, సింగింగ్, వంటి యాక్టివిటీస్ చేసే వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో తెగ చక్కర్లు కొడుతోంది. సాధారణంగా చేపలను వేటాడే పక్షులు నీటి పైకి వచ్చే చేపలను మాత్రమే వేటాడతాయి. కానీ ప్రస్తుతం ఓ వీడియో మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. పక్షుల గుంపు నీటిలోకి దూకి చేపలను పట్టుకుని ఆరగించేసింది. ఇది వినడానికి చాలా వింతగా అనిపించవచ్చు. కానీ అలాంటి పక్షులు కూడా ఉన్నాయన్న విషయం ఈ వీడియో చూశాక మీకే అర్థమవుతుంది.
Gannets dive-bombing a school of herring in Trinity Bay, Newfoundland.??
29 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోలో.. నీటిపై ఎగురుతున్న పక్షుల గుంపును చూడవచ్చు. అకస్మాత్తుగా ఈ పక్షులన్నీ ఒక్కొక్కటిగా నీటిలోకి దూకి చేపలను వేటాడతాయి. చేపలను నోటిలో పెట్టుకుని ఆకాశంలోకి తిరిగి వెళ్లిపోతాయి. ఇవి ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపించే కామికేజ్ పక్షులు. వారి శరీర నిర్మాణం ద్వారా అవి వేగంగా నీటిలోకి చొచ్చుకుని పోగలవు. ఈ వీడియో ఫిగెన్ అనే ఖాతాతో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ క్లిప్ కు ఇప్పటి వరకు కోటికి పైగా వ్యూస్, వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..