Husband-wife: ఇదెక్కడి విడ్డురం తల్లి..! భార్యతో కాపురం చేయాలంటే.. ప్రతినెలా భర్త డబ్బులు ఇవ్వాల్సిందే..
ఓ మహిళ తన భర్తకు ఓ వింత షరతు విధించింది. భర్తతోపాటుగా అత్తమామలు ఇంట్లో ఉండాలంటే తనకు నెలకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని తన భర్తకు కండిషన్ పెట్టింది. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది.
ఓ మహిళ తన భర్తకు ఓ వింత షరతు విధించింది. భర్తతోపాటుగా అత్తమామలు ఇంట్లో ఉండాలంటే తనకు నెలకు ఐదువేల రూపాయలు ఇవ్వాలని తన భర్తకు కండిషన్ పెట్టింది. ఈ విచిత్ర సంఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్‌లోని పూర్నియా జిల్లాలోని పోలీస్ కౌన్సెలింగ్ సెంటర్‌కు భార్యాభర్తల వివాదం ఒకటి వచ్చింది. భర్తతో కలిసి అత్తమామలు ఇంట్లో ఉండేందుకు అతడి భార్య విధించిన షరతు పోలీసు కౌన్సెలింగ్ సెంటర్ సభ్యులను విస్మయానికి గురి చేసింది. తన భర్త నెలకు 5000 ఇస్తేనే అత్తమామలతో కలిసి వారి ఇంట్లో భర్తతో కలిసి జీవిస్తానని మహిళ షరతు విధించింది. ఎందుకు ఇలాంటి షరతు పెడుతున్నావని ఆమెను ప్రశ్నించగా.. భర్త తనను వదిలేసి ఢిల్లీ-పంజాబ్‌కు వెళ్లి సంపాదిస్తున్నాడని, తాను ఇక్కడ ఇల్లు నడపడంలో చాలా కష్టపడుతున్నానని ఆ మహిళ చెప్పుకొచ్చింది. అయితే భార్య షరతుకు భర్త కూడా అంగీకరించి, ఈసారి బయటకు వెళ్లే ముందు భార్య ఖాతా తెరిచి అందులో డబ్బులు జమ చేసిన తర్వాతే వెళ్తానని చెప్పుకొచ్చాడు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసు కౌన్సెలింగ్ సెంటర్‌లో బాండ్ కుదుర్చుకుని పరస్పర అంగీకారంతో సంతకాలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
