Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS – CPI: ఆ కారణంతోనే టీఆర్ఎస్‌కు మద్ధతు.. అసలు విషయం చెప్పిన నారాయణ..

TRS - CPI: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్లారిటీ ఇచ్చారు. మునుగోడు..

TRS - CPI: ఆ కారణంతోనే టీఆర్ఎస్‌కు మద్ధతు.. అసలు విషయం చెప్పిన నారాయణ..
Cpi Narayana
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 21, 2022 | 10:01 PM

TRS – CPI: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ప్రకటించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ క్లారిటీ ఇచ్చారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ మద్ధతు ఇస్తుందని స్పష్టం చేశారు నారాయణ. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణతో టీఆర్ఎస్‌తో రాజకీయ సంబంధాలు లేకపోయినా.. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఓపెన్ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక బీజేపీ అగ్రనాయకత్వం నాటకంలో భాగంగానే వచ్చిందన్నారు. ఏపీలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వారికే సీపీఐ మద్ధతు ఉంటుందని కుండబద్దలుకొట్టారు నారాయణ. బీజేపీకి వైసీపీ, టీడీపీ, జనసేన భజన చేస్తున్నాయని విమర్శించారు నారాయణ. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తుల బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు.

భారత దేశ సమాఖ్య వ్యవస్థను బీజేపీ సర్వనాశనం చేస్తోందని నారాయణ విమర్శించారు. విభజన హామీలను బీజేపీ నెరవేర్చకపోయినా బీజేపీకే వైసీపీ, టీడీపీ మద్దతు ఇవ్వడం హేయమైనదన్నారు. మోదీ షేక్ హ్యాండ్‌తో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు పులకించి పోయారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేశాయో, కార్పోరేట్ కంపెనీలు ఎన్ని లక్షల కోట్లు దిగమింగాయో లెక్కలు తేల్చకుండా.. కేవలం సంక్షేమ పథకాలను గురించే న్యాయవ్యవస్థ ఆలోచించడం విచారకరమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..