Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: విజయవాడలో వైజాగ్ సీన్ రిపీట్.. లవర్ కోసం కాలువలో దూకిన బాలిక.. కట్ చేస్తే కహానీ మామూలుగా లేదు.. !

AP News: వైజాగ్ సాయి ప్రియ మిస్సింగ్ కేసు గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలేండి.. అంత త్వరగా మర్చిపోయే ఘటన కాదు మరి. అయితే, తాజాగా అచ్చం అలాంటి ఘటనే..

AP News: విజయవాడలో వైజాగ్ సీన్ రిపీట్.. లవర్ కోసం కాలువలో దూకిన బాలిక.. కట్ చేస్తే కహానీ మామూలుగా లేదు.. !
Vijayawada
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 20, 2022 | 1:06 AM

AP News: వైజాగ్ సాయి ప్రియ మిస్సింగ్ కేసు గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలేండి.. అంత త్వరగా మర్చిపోయే ఘటన కాదు మరి. అయితే, తాజాగా అచ్చం అలాంటి ఘటనే.. వైజాన్ సీన్‌కు 2.O లాంటి సీన్ విజయవాడలో వెలుగు చూసింది. ఆ ఘటన సంబంధించిన వివరాలు తెలిస్తే మైండ్ బ్లాంక్ అవడం ఖాయం. అవును, ఓ బాలిక తన ప్రేమికుడి కోసం ఏకంగా కాలువలోకి దూకింది. అలా ఆత్మహత్య చేసుకున్నట్లు అందరికీ కలరింగ్ ఇచ్చిన బాలిక.. అక్కడి నుంచి పరారైంది. అయితే, కుటుంబ సభ్యులు, బంధువు అందరూ ఆ బాలిక టెన్త్ ఫెయిల్ కావడంతో సూసైడ్ చేసుకుందని భావించారు. కానీ, పోలీసులు అంత ఈజీగా నమ్మరు కదా.. ఇక్కడా అదే జరిగింది. కట్ చేస్తే నెల రోజుల తరువాత మేడం గారీ హైడ్రామా అంతా బయటపడింది. ఆ బాలిక ప్లాన్ తెలిసి పోలీసులే అవాక్కాయ్యారు. ఇంతకీ బాలిక అలా ఎందుకు చేసింది? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈత రావడంతో జంప్.. గత నెల 22వ తేదీన బాలిక(17) ఏలూరు కాలువలోకి దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే కాలువలోకి దూకేసింది. విషయం తెలుసుకున్న గుణదల పోలీసులు కాలువ వద్దకు వచ్చి గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు రెండు రోజులపాటు తీవ్రంగా గాలించారు. తల్లిదండ్రులను అడిగితే.. పదవ తరగతి పరీక్ష ఫెయిల్ అవడంతో దూకేసిందని సమాధానం ఇచ్చారు. అయితే, రెండు రోజులు వెతికినా కాలువలో బాడీ దొరక్కపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారణ చేపట్టారు. బాలిక తల్లిదండ్రులు, ఆమె స్నేహితులను విచారించారు. ఈ విచారణలో బాలికు ఈత వచ్చని తెలియడం, ఆమె ప్రేమ వ్యవహారం వంటి వివరాలు తెలియడంతో.. మిస్టరీ చేధన మరింత ఈజీ అయ్యింది.

రౌడీషీటర్‌తో ప్రేమాయణం.. స్థానికంగా ఉండే రౌడీషీటర్ దుర్గారావుతో బాలిక మూడేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే, రౌడీషీటర్‌తో ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించని భావించి ఇలా సూసైడ్ డ్రామా వేసింది. అనుకున్న ప్లాన్ ప్రకారం.. రాత్రి సమయంలో బాలిక కాలువలోకి దూకింది. అయితే, ఆమెకు ఈత రావడంతో కాలువ నుంచి గుట్టు చప్పుడు కాకుండా తప్పించుకుంది. ఈ కేసును చేధించడానికి పోలీసులు సుమారు నెల రోజుల పాటు శ్రమించారు. మొత్తానికి అసలు వ్యవహారం తెలియడంతో.. రౌడీషీటర్ దుర్గారావు, బాలిక కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..