Lorry Theft Gang: మద్యం తాగేందుకు డబ్బులు సరిపోకపోవడంతో.. చివరికి ఏకంగా బోర్ వెల్ లారీనే మాయం చేశారు.. చివరికి..
Boru Lorry theft: తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే బోరు బండి మాయమైంది. ఏమైందో యజమానికి అర్థం కాలేదు. దీంతో రాజ్యలక్ష్మి అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచిత్రమైన కేసు కావటంతో..
గుంటూరు నగరంలో భారత్ పేట నాలుగో లైన్ లో బోరు లారిని పార్క్ చేశారు. తెల్లవారిన తర్వాత వచ్చి చూస్తే బోరు బండి మాయమైంది. ఏమైందో యజమానికి అర్థం కాలేదు. దీంతో రాజ్యలక్ష్మి అరండల్ పేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచిత్రమైన కేసు కావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రాత్రి సమయంలో నగరంలో నుంచి బయటకు వెళ్ళిన బోరు బండి ఆధారాలను సీసీ కెమెరాల ద్వారా సేకరించారు. నగరంలోకి మల్లిఖార్జున పేటకు చెందిన సాంబశివరావు, చెంచురామయ్య, అభిషేక్ ఒక ముఠాగా ఏర్పడ చోరి లకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ ముగ్గురు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. ఈ క్రములోనే బోరు బండిని అపహరించ ఏటుకూరు తరలించారు. అక్కడ ఒక గోడౌన్ లో దాన్ని దాచి పెట్టారు.
అయితే ఈ ముగ్గురు ఏటుకూరు వద్ద ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ దొంగలను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని ఒప్పుకున్నారు. బోరు బండిని దాచిపెట్టిన గోడౌన్ వద్దకు పోలీసులను తీసుకెళ్ళారు. దీంతో ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు బోరు బండిని స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం