Shocking: దారుణాతి దారుణం.. తోటలో మొక్కలు తిన్నాయని మేకల కళ్లు పీకేశారు..
Shocking: ఖమ్మంలో దారుణాతి దారుణ ఘటన వెలుగు చూసింది. కనీస మానవత్వమైనా లేదా? అనిపించే ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది.
Shocking: ఖమ్మంలో దారుణాతి దారుణ ఘటన వెలుగు చూసింది. కనీస మానవత్వమైనా లేదా? అనిపించే ఈ ఘటన అందరినీ కలిచివేస్తోంది. మొక్కలు తిన్నాయనే కారణంతో ఓ వ్యక్తి కసాయిలా మారి.. మేకల కళ్లు పీకేశాడు. అతని చర్యతో రెండు మేకలు మృతి చెందాయి. ఈ దారుణ ఘటన ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలం రావినూతలలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావి నూతలలో సుబాబుల్ తోటలోకి మేకలు వెళ్లాయి. అక్కడ మేత మేశాయి. అయితే, తోట యజమానికి మేకలు మేత మేయడంపై ఆగ్రహించాడు. సుబాబుల్ చెట్లను తిన్న రెండు మేకల కళ్లు పీకేశాడు తోట యజమాని. అడ్డుకోబోయిన మేకల కాపరి గిరిజన మహిళ, ఆమె మామపై కర్రలతో దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో మహిళ మామ స్పృహతప్పిపడిపోయాడు. కళ్లు పీకేసిన రెండు మేకలు చనిపోయాయి. దాంతో బాధిత మహిళ బోనకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..