Ramojirao – Amit Shah: రామోజీరావుతో ప్రత్యేకంగా భేటీ అయిన అమిత్ షా.. కీలక అంశాల ప్రస్తావన?
Ramojirao - Amit Shah: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు.
Ramojirao – Amit Shah: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. రామోజీ గ్రూప్ అధినేత రామోజీరావుతో భేటీ అయ్యారు. మునుగోడులో బీజేపీ సభ అనంతరం ఆయన నేరుగా రామోజీ ఫిలింసిటీకి వెళ్లారు. ఈ సందర్భంగా రామోజీరావు.. అమిత్ షాకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన సాదరంగా తన నివాసానికి తీసుకెళ్లారు. అమిత్ షా, రామోజీ రావులు కాసేపు ఏకాంతంగా భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, అమిత్ షా వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పటికీ.. అమిత్ షా, రామోజీరావులు మాత్రమే ప్రత్యేకంగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం అమిత్ షా తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. నోవాటెల్ హోటల్‌లో బస చేయనున్న ఆయన.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌తో కలిసి డిన్నర్ చేయనున్నారు. ఎన్టీఆర్‌తో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..