Hyderabad: కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. నోవాటెల్ వేదికగా సమావేశం

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్ర..

Hyderabad: కేంద్ర మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. నోవాటెల్ వేదికగా సమావేశం
Amit Sha Ntr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 22, 2022 | 12:23 AM

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారు. నోవాటెల్‌ హోటల్‌లో కేంద్రమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రి అమిత్‌షా, జూ.ఎన్టీఆర్‌ భేటీపై రాజకీయవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను ప్రశంసించడానికే ఎన్టీఆర్‌ను అమిత్ షా ఆహ్వానించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీరిద్దరి కలయిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. మరోవైపు.. హైదరాబాద్ పర్యటనలో ఉన్న అమిత్ షా మునుగోడులో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అనంతరం రామోజీఫిల్మ్ సిటీలో రామోజీరావును కలిశారు. అనంతరం నోవాటెల్ హోటల్ లో తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌తో సమావేశం అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి