Health Tips: రోజూ 8 గంటలపాటు నిద్రపోవడం లేదా..? మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లేనట..
Health Tips: ఆరోగ్యకరమైన శరీరానికి మంచి నిద్ర చాలా అవసరం. సాధారణంగా 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తారు.
Health Tips: ఆరోగ్యకరమైన శరీరానికి మంచి నిద్ర చాలా అవసరం. సాధారణంగా 24 గంటల్లో కనీసం 8 గంటలు నిద్రపోవాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తారు. దీని కారణంగా మన శరీరం రిలాక్స్ అవుతుంది. అయితే, ప్రస్తుత ఉరుకులు, పరుగుల జీవితంలో కొందరి నిద్ర సమయం, జీవనశైలి భిన్నంగా ఉంటుంది. కొందరు నిర్ణీత సమయం కంటే ఎక్కువ నిద్రపోతే, కొందరు తక్కువ సమయం నిద్రపోతారు. ఇలాంటి వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొందరు ప్రత్యేక వ్యక్తులకు మాత్రం 8 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం అని నిపుణులు చెబుతున్నారు. మరి 8 గంటల కంటే ఎక్కువ నిద్ర అవసరం అయ్యే వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
8 గంటల నిద్ర అవసరం.. చాలా మంది కనీసం 8 గంటల నిద్ర సరిపోతుందని భావిస్తుంటారు. కానీ బలహీనంగా, నీరసంగా ఉన్నట్లయితే ఎక్కువ నిద్ర అవసరం. 9 నుండి 10 గంటలు నిద్రపోవాల్సి వస్తుంది.
వాతావరణ పరిస్థితులు మారినప్పుడు.. వాతావరణం మారినప్పుడు మన శరీర ఆకృతి కూడా మారుతుంది. ముఖ్యంగా, నిద్ర విధానాలలో మార్పు ఉంటుంది. వాతావరణం మారినప్పుడు కొంతమందికి సాధారణం కంటే ఎక్కువ నిద్ర అవసరం ఉంటుంది.
పీరియడ్స్ సమయంలో.. పీరియడ్స్ సమయంలో స్త్రీల శరీరంలో అంతర్గతంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో వారు చాలా బలహీనంగా, తీవ్రమైన అలసటతో ఇబ్బంది పడుతారు. అందువల్ల ఋతు చక్రంలో మహిళలు దాదాపు 9 గంటల నిద్ర అవసరం. తద్వారా అతను ఈ పరిస్థితుల్లో హుషారుగా ఉండగలుగుతాడు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..