Health Tips: ఆరోగ్యాన్ని కలకాలం కాపాడే గింజలు.. రెగ్యులర్‌గా తింటే ఆ రోగాలన్నీ మాయమైనట్లే.. అవేంటంటే..?
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహారంలో కొన్ని విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ గింజల్లో అనేక పోషకాలు దాగున్నాయి.
Seeds For Better Health: ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు చాలామంది పండ్లు, జ్యూస్‌లు, మంచి ఆహారం తీసుకుంటుంటారు. అయితే.. ఇవి కాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహారంలో కొన్ని విత్తనాలను కూడా తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ గింజల్లో అనేక పోషకాలు దాగున్నాయి. వాటి ప్రయోజనాలు, లక్షణాల గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అదే సమయంలో చాలా మంది వీటిని రోజూ తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆ విత్తనాలేంటి..? ఈ గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఈ విత్తనాలను ఇంకా స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
చియా విత్తనాలు: చియా విత్తనాలు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు దివ్యౌషధంగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఈ గింజలను తీసుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది. చియా గింజల్లో ఒమేగా-3 యాసిడ్‌లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతేకాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
గుమ్మడికాయ గింజలు: గుమ్మడికాయ గింజలు తినడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. గుమ్మడికాయ రసంతో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంచుకోవచ్చు. అదేవిధంగా దీని విత్తనాలు కూడా విభిన్న ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో అత్యధిక మొత్తంలో ఫాస్పరస్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 యాసిడ్‌లు ఉంటాయి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కారణంగా స్ట్రోక్ ప్రమాదం చాలా తగ్గుతుంది.
పొద్దుతిరుగుడు విత్తనాలు: సన్‌ఫ్లవర్ ఆయిల్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిసే ఉంటుంది. అయితే పొద్దుతిరుగుడు విత్తనాలను తినడం ద్వారా కూడా బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ బి, విటమిన్ ఇ, సెలీనియం పుష్కలంగా ఉన్నాయి. వృద్ధులు దీనిని ప్రతిరోజూ తినాలి.. ఎందుకంటే దీని వినియోగం ద్వారా వాపు సమస్య తగ్గుతుంది. అలాగే, గుండె జబ్బులు కూడా దూరమవుతాయి.
అవిసె గింజలు: అవిసె గింజలు మహిళలకు ఉత్తమమైనవిగా పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈ విత్తనాలను రోజూ తినే స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్, ట్యూమర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇది కాకుండా అవిసె గింజలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇంకా ఈ అవిసె గింజలలో లిగ్నాన్స్ ఉన్నందున వీటిని కాల్చి స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి