Diabetes Care: సమతుల్య ఆహారంతో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చు.. అవేంటో తెలుసుకోండి..
ఏదైనా తిన్న తర్వాత ఆ ఆహారం నుంచి గ్లూకోజ్ శరీరంలో తయారవుతుంది. ఇది మీ శరీరంలోని కణాల సహాయంతో శక్తిని చేరుకోవడానికి పనిచేస్తుంది.
Diabetes Care Tips: ప్రస్తుత కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలామంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. డయాబెటిస్ అనేది ఒక్కసారి వస్తే.. జీవితాంతం బాధపడే విధంగా చేస్తుంది. బ్లడ్ షుగర్ ఎక్కువైనప్పుడల్లా పలు సమస్యలు చుట్టుముడుతుంటాయి. బ్లడ్ గ్లూకోజ్ చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి బారిన పడతారని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ ప్రధాన శక్తి వనరు. అంటే, మీరు ఏదైనా తిన్న తర్వాత ఆ ఆహారం నుంచి గ్లూకోజ్ శరీరంలో తయారవుతుంది. ఇది మీ శరీరంలోని కణాల సహాయంతో శక్తిని చేరుకోవడానికి పనిచేస్తుంది. కానీ కాలక్రమేణా మీ శరీరంలో ఎక్కువ గ్లూకోజ్ ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి. షుగర్‌కి శాశ్వత ఔషధం అంటూ లేదు. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే మీ జీవితాంతం దానితో స్నేహం చేయాల్సిందే. అందుకే.. దానిని నియంత్రణలో ఉంచుకోవడం ముఖ్యం. మధుమేహం రకాలు, వాటి చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ అంటే ఏమిటి..?
బాల్యంలో కూడా టైప్ 1 మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. తల్లిదండ్రులు ఇప్పటికే ఇంట్లో డయాబెటిక్ పేషెంట్లుగా ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. ఇన్సులిన్ ఒక హార్మోన్. గ్లూకోజ్ సహాయంతో శరీరానికి శక్తిని అందించడమే దీని పని. మరోవైపు, మీరు ప్రతిరోజూ జంక్ ఫుడ్ తినడం, అనారోగ్యకరమైన జీవనశైలిని జీవనశైలితో టైప్ 2 డయాబెటిస్ బాధితులుగా మారుతారు.
డయాబెటిక్ రోగులకు ఉత్తమ ఆహారం
మధుమేహాం ఉంటే జీవితాంతం బాధిస్తుంది. కావున షుగర్ లెవల్స్‌ను నియంత్రించుకోవడం ముఖ్యం. దీనికోసం మంచి సమతుల్య ఆహారం తీసుకోవాలి. చాలామంది బిజీగా ఉండటం వల్ల ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోరు. కానీ, సమతుల్య ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తే.. రక్తంలో చక్కెర స్థాయి అలాగే నియంత్రణలో ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. సమతుల్య ఆహారం కోసం ఆహారంలో బఠానీలు, బీన్స్, ఓట్స్, బార్లీ, యాపిల్స్, బేరి, బెర్రీలు, చిలగడదుంపలు, మొలకలు, బ్రోకలీ, క్యారెట్లు, దుంపలు వంటి ఆహారాలను చేర్చుకోవాలి. దీంతోపాటు జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి