AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మద్యం, సిగరెట్ తాగే అలవాటుందా..? అయితే, ఆ ముప్పు తప్పదట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్రపంచంలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాలలో ధూమపానం, అతిగా మద్యం తాగడం కూడా ప్రధాన కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది.

Health: మద్యం, సిగరెట్ తాగే అలవాటుందా..? అయితే, ఆ ముప్పు తప్పదట.. తాజా పరిశోధనలో షాకింగ్ విషయాలు..
Smoking Alcohol
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 20, 2022 | 8:53 PM

Smoking and Drinking Affect : చాలా మందికి మద్యపానం, ధూమనం చేసే అలవాటు ఉంటుంది. కొంతమంది వ్యక్తులు కేవలం అభిరుచి కోసం మాత్రమే స్మోకింగ్, మద్యం సేవిస్తారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీటికి వ్యసనంగా మారినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ప్రపంచంలో క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాలలో ధూమపానం, అతిగా మద్యం తాగడం కూడా ప్రధాన కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని పరిశోధన పత్రిక లాన్సెట్‌ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

పరిశోధనా పత్రిక ‘లాన్సెట్’లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 44.5 లక్షల మంది క్యాన్సర్ మరణాలకు ధూమపానం, మద్యపానం, అధిక బాడీ మాస్ ఇండెక్స్ (అధిక శరీర బరువు) ప్రధాన కారకాలుగా పేర్కొంది. ‘బాడీ మాస్ ఇండెక్స్’ (BMI) అనేది ఒక వ్యక్తి బరువు, ఎత్తు ఆధారంగా పరిగణలోకి తీసుకుంటారు. ఊబకాయం ఉంటే బీఎంఐ అధికంగా ఉంటుంది.

ప్రమాద కారకాలను గుర్తించడంలో సహాయం..

ఈ పరిశోధనల విధాన రూపకర్తలు.. కీలక ప్రమాద కారకాలను గుర్తించారు. ప్రాంతీయ, జాతీయ, ప్రపంచ స్థాయిలలో క్యాన్సర్ మరణాలను తగ్గించే ప్రయత్నాలలో ఇవి సహాయపడతాయని పరిశోధకులు తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు..

USలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHMI) డైరెక్టర్ క్రిస్టోఫర్ ముర్రే ఈ విషయం మాట్లాడుతూ ‘‘క్యాన్సర్ ప్రమాదం ఒక ముఖ్యమైన ప్రజారోగ్య సవాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని అధ్యయనం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌కు ధూమపానం ప్రధాన ప్రమాద కారకంగా ఉంది’’ అని అధ్యయనం హెడ్ ముర్రే చెప్పారు.

పొగాకు, ఆల్కహాల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం.. 

గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ (GBD) 2019 నుంచి అధ్యయన ఫలితాలను ఉపయోగించి, పరిశోధకులు 34 ప్రవర్తనా, పర్యావరణ, వృత్తిపరమైన ప్రమాద కారకాలు, 23 రకాల క్యాన్సర్‌ల మరణాలను ఎలా తగ్గించాయో వివరించారు. ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ప్రభావితం చేయడం లాంటి వాటిపై కూడా పరిశీలించారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు పొగాకు, మద్యపానం, అసురక్షిత సెక్స్, ఆహార ప్రమాదాలు వంటి కారణాలు కారణమని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి