AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kidney Health: శరీరంలోని ఆ ప్రాంతాల్లో నొప్పి ఉంటే మీ కిడ్నీలకు గండమే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

కిడ్నీలల్లో లోపం ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. దీని బారిన పడినవారు తీవ్రమైన నొప్పితో బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది.

Kidney Health: శరీరంలోని ఆ ప్రాంతాల్లో నొప్పి ఉంటే మీ కిడ్నీలకు గండమే.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Kidney Health
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2022 | 7:01 PM

Share

Kidney diseases: కిడ్నీల వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మన రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. అటువంటి పరిస్థితిలో కిడ్నీలు ప్రతికూల అంశాలకు ప్రభావితమైనప్పుడు లేదా వాటిలో లోపం ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి. దీని బారిన పడినవారు తీవ్రమైన నొప్పితో బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుంది. మూత్రపిండాలు దెబ్బతిన్నట్లయితే ఆ వ్యక్తి కొన్ని భాగాలలో నొప్పిని అనుభవిస్తాడు. కావున.. ఆ శరీర భాగాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండాలు అనారోగ్యానికి గురైనప్పుడు శరీరంలోని ఏ భాగాల్లో నొప్పి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందంటే..?

  • కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు.. ఆ వ్యక్తి ఛాతీ నొప్పిని అనుభవించవచ్చు. కిడ్నీ, ఛాతీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. మూత్రపిండాల వైఫల్యం కారణంగా గుండెను కప్పి ఉంచే లైనింగ్ ఉబ్బుతుంది. దీని కారణంగా వ్యక్తికి ఛాతీ నొప్పితో సమస్యలు ఉండవచ్చు.
  • కిడ్నీ ఏదైనా లోపంతో ప్రభావితమైనప్పుడు లేదా మూత్రపిండాల్లోనే లోపం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వెన్నునొప్పి సమస్య ఉండవచ్చు. మూత్రపిండము చాలా కాలం పాటు మూత్రాన్ని ఉత్పత్తి చేయలేకపోవడమే దీనికి కారణం. వ్యక్తి వెనుక భాగంలో నొప్పిని అనుభవించవచ్చు. మీరు కూడా చాలా కాలం పాటు వెన్నునొప్పితో బాధపడుతుంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అనారోగ్య మూత్రపిండాల లక్షణాలలో ఇది కూడా ఒకటి.
  • పిల్లలకి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు అతను పొత్తి కడుపులో నొప్పిని కూడా అనుభవించవచ్చు. అయితే, మూత్ర నాళంలో నొప్పి ఉంటే అది కూడా ఇన్ఫెక్షన్ లక్షణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

గమనిక – పైన పేర్కొన్న భాగాలలో మీకు ఎక్కువ నొప్పి అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది..

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి