Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urine Bad Smell: మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా..? కారణం అవే కావొచ్చట.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

రాత్రి సరిగ్గా నిద్రపోనప్పుడు కాఫీ, టీ లేదా సోడా వంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మూత్రం నుంచి ఘాటైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది.

Urine Bad Smell: మూత్రం నుంచి దుర్వాసన వస్తోందా..? కారణం అవే కావొచ్చట.. అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Urine Odor
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2022 | 9:00 PM

Urine odor Causes : మారుతున్న కాలం లేదా జీవనశైలిలో కొన్ని అనవసరమైన మార్పుల కారణంగా శరీరం అనేక రకాలుగా ప్రతిస్పందిస్తుంది. వీటిలో మూత్రం నుంచి దుర్వాసన రావడం కూడా ఒక కారణం. మీరు రాత్రి సరిగ్గా నిద్రపోనప్పుడు కాఫీ, టీ లేదా సోడా వంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ఇది జరుగుతుంది. అప్పుడు మూత్రం నుంచి ఘాటైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా అలాంటి కొన్ని కారణాలతో మూత్రం నుంచి విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఇలాంటి సమయంలో వెంటనే జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డీహైడ్రేషన్: శరీరంలో తీవ్రమైన డీహైడ్రెషన్ సమస్య (నిర్జలీకరణం) ఉన్నప్పుడు ముందుగా మూత్రం రంగు మందపాటి పసుపు రంగులోకి మారుతుంది. దీని తరువాత మూత్రంలో మంట సమస్య వస్తుంది. అప్పుడు కూడా శ్రద్ధ చూపకపోతే.. మూత్రం మళ్లీ మళ్లీ వచ్చినట్లు ఒత్తిడి పెరుగుతుంది. కానీ మూత్రం రాదు. చుక్కలు చుక్కలు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భంలో మూత్రం నుంచి బలమైన దుర్వాసన వస్తే అప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ పరిస్థితి కూడా శరీరంలోని అంతర్గత అవయవాలలో ఇన్ఫెక్షన్ పెరుగుతోందనడానికి సంకేతం.

ఆహారం: పచ్చి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కరివేపాకు, మొలకలు, ఇంగువ, మొలకలను క్రమం తప్పకుండా లేదా పెద్ద పరిమాణంలో తినే వ్యక్తుల్లో మూత్రం ఘాటైన వాసన కలిగి ఉంటుంది. అయినప్పటికీ, ఈ పరిస్థితిని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మూత్రంలో సల్ఫర్ పరిమాణం పెరగడం వల్ల జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

చెడు అలవాట్లు: మద్యం సేవించే వ్యక్తుల్లో మూత్రం ఘాటైన వాసనతో ఉంటుంది. అలాంటి పరిస్థితి ధూమపానం చేసేవారిలో కూడా ఉంటుంది. సోడా, కోక్ వంటి పానీయాలను అధికంగా లేదా క్రమం తప్పకుండా తాగేవారికి కూడా మూత్రం వాసన వచ్చే సమస్య ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఇది మూత్రం వ్యాధి లక్షణం కాదు, కానీ ఈ కారణాలన్నీ శరీరాన్ని లోపలి నుంసీ బలహీనంగా మారుస్తాలీ. అందువల్ల, ఈ అలవాట్లను ముందుగానే నియంత్రించడం అవసరం.

మహిళల్లో మూత్రం వాసన వచ్చే సమస్య..

సాధారణంగా స్త్రీలకు ఈ కారణాల వల్ల మూత్రం వాసన వచ్చే సమస్య ఉంటుంది.

  • UTI (Urinary tract infection) సంక్రమణ
  • తక్కువ నీరు తాగడం అలవాటు
  • గర్భం సమయంలో
  • ఔషధాల వినియోగం
  • మద్యపానం-ధూమపానం
  • ప్రెగ్నెన్సీ కాకుండా ఈ సమస్యల్లో ఏదైనా ఒకటి ఎక్కువ కాలం కొనసాగితే, మహిళలు దాని తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందువల్ల చెడు అలవాట్లను సమయానికి నియంత్రించండి. UTI సమస్య ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి సరైన చికిత్స పొందండి.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు లేదా ఏదైనా వ్యాధికి క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారి మూత్రం కూడా ఘాటైన వాసన వస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆందోళన చెందడానికి బదులుగా మీ వైద్యుడిని సంప్రదించి సరైన కారణాన్ని తెలుసుకుని, నిశ్చింతగా ఉండండి. ఎందుకంటే ఇది కొన్ని మందుల వల్ల ఇలా జరుగుతుంది.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి