Healthy Liver: ఈ పదార్థాలను తీసుకుంటే మీ లివర్ ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..

అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయంలో టాక్సిన్స్ నిండిపోతాయి. ఈ కారణంగా శరీరంలో జీవక్రియ ప్రక్రియ ప్రభావితమవుతుంది.

Healthy Liver: ఈ పదార్థాలను తీసుకుంటే మీ లివర్ ప్రమాదంలో పడినట్లే.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..
Healthy Liver
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2022 | 3:37 PM

Avoid these food for Healthy Liver: మానవ శరీరంలోని అన్ని అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రధానపాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అలాంటి అవయవాల్లో కాలేయం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల కాలేయంలో టాక్సిన్స్ నిండిపోతాయి. ఈ కారణంగా శరీరంలో జీవక్రియ ప్రక్రియ ప్రభావితమవుతుంది. ఫలితంగా శరీరంలో అనేక సమస్యలు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో అలాంటి కొన్ని ఆహారాలను నివారించడం ద్వారా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాలేయాన్ని దెబ్బతీసే ఆహారాలేంటి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకోండి..

  1. మద్యం: చాలా మంది మద్యం తాగుతారు. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్ వాపు, సెల్ డెత్, ఫైబ్రోసిస్‌కు దారితీస్తుంది. అదే సమయంలో కాలేయ సిర్రోసిస్ కూడా సంభవించవచ్చు.
  2. చక్కెర: చక్కెరను అధికంగా తీసుకోవడం శరీరానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఊబకాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. కావున పరిమిత పరిమాణంలో చక్కెరను తినండి.
  3. రెడ్ మీట్: చాలా మంది మాంసం తీసుకుంటారు. తెల్ల మాంసం అంటే చికెన్, చేపలు తీసుకోవడం మంచిది. కానీ రెడ్ మీట్ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. ఎందుకంటే ఇది జీర్ణం కావడం చాలా కష్టం.
  4. ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్: ఫాస్ట్ ఫుడ్‌ను చాలామంది ఇష్టంతో తింటారు. బర్గర్‌, శాండ్‌విచ్‌, పిజ్జా, ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ చూడగానే నోట్లో నీరూరుతాయి. ఇవి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇవి సులభంగా జీర్ణం కావు, ఇంకా కాలేయాన్ని దెబ్బతీస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. మైదా పిండి: మైదా పిండిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఇది భారీగా ప్రాసెస్ అవుతుంది. దీనిలోకి ఖనిజాలు, ఫైబర్, ఇతర అవసరమైన పోషకాలను కలిగి ఉండదు.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి