Headache: తలనొప్పికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్తున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

తలనొప్పికి ట్యాబ్లెట్ వేసే వారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పితోపాటు.. ఎలాంటి నొప్పికైనా పెయిన్ కిల్లర్ తీసుకోవడం అనేది ఏ కోణం నుంచి చూసినా ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంటున్నారు.

Headache: తలనొప్పికి పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ వేస్తున్నారా..? అయితే, ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Headache Remedies
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 21, 2022 | 5:40 PM

Painkiller for Headache: తలనొప్పి అనేది ఒక సాధారణం. ఈ సమస్య చాలా మందిని వేధిస్తుంటుంది. ఈ క్రమంలో తలనొప్పిని వదిలించుకోవడానికి నొప్పి నివారణ మందులను ఉపయోగించడం కూడా సర్వసాధారణం అవుతుంది. ఈ రోజుల్లో చాలామంది తలనొప్పిని చాలా సాధారణమైనదిగా పరిగణించడంతోపాటు.. పెయిన్ కిల్లర్ లేకుండా నయం కాదని భావిస్తున్నారు. ఈ పద్దతి వారి ఆరోగ్యాన్ని క్రమంగా నాశనం చేస్తుంది. తలనొప్పికి ట్యాబ్లెట్ వేసే వారిని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పితోపాటు.. ఎలాంటి నొప్పికైనా పెయిన్ కిల్లర్ తీసుకోవడం అనేది ఏ కోణం నుంచి చూసినా ఆరోగ్యానికి మంచిది కాదని పేర్కొంటున్నారు. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మందులు తీసుకోకుండా కూడా తలనొప్పిని ఎలా వదిలించుకోవచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈ సమస్యను సులభంగా వదిలించుకోవచ్చు. అవేంటో చూద్దాం..

  • నూనెతో మసాజ్: విపరీతమైన తల నొప్పి ఉంటే ఏదైనా నూనెతో మర్ధన చేయాలి. వాస్తవానికి నూనెతో మసాజ్ చేయడం వల్ల నరాలకు విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • ఐస్ ప్యాక్‌: శుభ్రమైన వస్త్రంలో ఐస్ చుట్టి నుదుటిపై తేలికగా అద్దుతూ మసాజ్ ఉండాలి. ఇది తీవ్రమైన తలనొప్పికి సైతం తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఈ ఐస్ ప్యాక్‌ని రోజుకు ఒకసారి ఉపయోగించుకోవచ్చు.
  • హాట్ రైస్ ప్యాక్: బియ్యాన్ని గ్రిడిల్‌పై వేడి చేసి, ఆపై పాలీబ్యాగ్ లేదా క్లాత్ బ్యాగ్‌లో బియ్యాన్ని నింపండి. దీనితో మీరు నుదిటిపై అప్లై చేస్తూ మసాజ్ చేసుకోవచ్చు. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • హైడ్రేట్ గా ఉండండి: శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించండి. ఎందుకంటే నీటి కొరత కూడా తలనొప్పికి కారణమవుతుంది. మీకు ఎప్పుడైనా తలనొప్పి అనిపిస్తే, 2 గ్లాసుల చల్లని నీరు తాగండి. అది కూడా ఉపశమనం కలిగిస్తుంది.
  • శ్వాస వ్యాయామం: 10 నిమిషాలపాటు శ్వాస వ్యాయామం చేయండి. శ్వాస వ్యాయామాలలో నరాలకు చాలా విశ్రాంతి లభిస్తుంది. దీంతో మీరు రిలాక్స్‌గా ఉంటారు.

మరిన్ని హెల్త్  న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!