New Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు మరిన్ని కష్టాలు.. మనీలాండరింగ్‌ కేసుకు సిద్ధమైన ఈడీ..

New Delhi: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో ట్విస్ట్ చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఈడీ కూడా రంగం లోకి దిగబోతోంది. సీబీఐ ఇచ్చిన ఆధారాలతో డిప్యూటీ సీఎం సిసోడియా

New Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు మరిన్ని కష్టాలు.. మనీలాండరింగ్‌ కేసుకు సిద్ధమైన ఈడీ..
Enforcement Directorate
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 21, 2022 | 9:58 PM

New Delhi: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో ట్విస్ట్ చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఈడీ కూడా రంగం లోకి దిగబోతోంది. సీబీఐ ఇచ్చిన ఆధారాలతో డిప్యూటీ సీఎం సిసోడియాపై మనీలాండరింగ్‌ కేసు నమోదుకు రంగం సిద్దమయ్యింది. అయితే సీబీఐ దాడుల్లో ఏమి దొరకలేదని, ఈడీ విచారణలో కూడా ఏమి దొరకదంటున్నారు ఆప్‌ నేతలు.

అవును, లిక్కర్‌స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు కష్టాలు మరింత పెరిగాయి. సిసోడియాపై ఈడీ త్వరలో మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయబోతోంది. స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లను సీబీఐ అధికారులు ఈడీకి పంపించారు. మనీష్‌ సిసోడియాపై ఇప్పటివరకు లుకౌట్‌ నోటీసులు జారీ చేయలేదని సీబీఐ వర్గాలంటున్నాయి.

అంతకుముందు మనీష్‌ సిసోడియాతో పాటు ఎక్సైజ్‌ స్కాంలో నిందితులుగా ఉన్న 14 మందిపై సీబీఐ లుకౌట్‌ నోటీసులు జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. తన ఇంట్లో సోదాలు చేసిన సీబీఐ అధికారులకు ఎలాంటి ఆధారాలు, డబ్బు లభించలేదని అన్నారు సిసోడియా. సీబీఐతో ప్రధాని మోదీ తనను బెదిరించలేరని అన్నారు. లుకౌట్‌ నోటీసులకు తాను భయపడడం లేదన్నారు. ఢిల్లీ లోనే ఉన్నప్పటికి తనపై ఎందుకు లుకౌట్‌ నోటీసులు జారీ చేశారని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ఈడీ సోదాలకు కూడా తాము భయపడడం లేదని ఆప్‌ స్పష్టం చేసింది. సిసోడియా నివాసంలో సీబీఐకి ఏమి దొరకలేదని, ఈడీకి కూడా ఏమి దొరకదన్నారు ఆప్‌ ఎమ్మెల్యే ఆతిషి. ‘‘మీరు ఈడీని కూడా పంపిస్తున్నారు.. ఈడీ కూడా దర్యాప్తు చేసుకోవచ్చు. సీబీఐ దాడుల్లో ఎంత డబ్బు పట్టుబడిందో చెప్పాలి. ఆఖరికి దేవుని దగ్గర పెట్టిన డబ్బులను కూడా లెక్క పెట్టారు. దేశం ముందు సీబీఐ ఎంత డబ్బు దొరికిందో చెప్పాలి. ఈడీ దాడుల తరువాత కూడా ఏమి దొరకదు’’ ఆతిషి అన్నారు. అయితే ఆప్‌ విమర్శలకు బీజేపీ గట్టి కౌంటరిచ్చింది. కేంద్ర దర్యాప్తు సంస్థలపై నిందలు వేయడం మానుకోవాలని కేజ్రీవాల్‌కు హితవు పలికింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..