Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

President Of Congress: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరు? రాహుల్‌ సిద్ధంగా ఉన్నారా..? పునరాలోచనలో అధిష్టానం

President Of Congress: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. నివేదికల ప్రకారం.. ప్రతి ఎంపికపై ఆలోచనలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ..

President Of Congress: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరు? రాహుల్‌ సిద్ధంగా ఉన్నారా..? పునరాలోచనలో అధిష్టానం
President Of Congress
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Aug 22, 2022 | 6:53 AM

President Of Congress: కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. నివేదికల ప్రకారం.. ప్రతి ఎంపికపై ఆలోచనలు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ సిద్ధంగా లేకుంటే, గాంధీ కుటుంబానికి విధేయుడైన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. లేదా 2024 లోక్‌సభ ఎన్నికల వరకు అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడి ఎన్నికల తేదీలను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నారు. రాహుల్ గాంధీని ఒప్పించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అధ్యక్ష పదవికి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరని మీకు తెలియజేద్దాం.

అయితే సోనియా గాంధీ స్థానంలో కాంగ్రెస్ తదుపరి అధ్యక్షురాలు ఎవరు ? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఇందుకోసం నేటి నుంచి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభం కాగా.. పార్టీలో సందిగ్ధత నెలకొంది. రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అగ్రనేతలు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. అదే సమయంలో ఈ బాధ్యతను స్వీకరించడానికి రాహుల్ సిద్ధంగా లేకుంటే, గాంధీ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న పార్టీ నాయకుడికి కూడా అధ్యక్ష పదవిని ఇవ్వవచ్చని పార్టీ వర్గాల ద్వారా సమాచారం. కాగా, మద్యం కుంభకోణంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా 13 మంది నిందితులపై సీబీఐ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. అయితే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు మనీష్ సిసోడియాతో పాటు మొత్తం 13 మంది నిందితులు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేదు.

ఇకపోతే.. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఎత్తున సీట్లను కైవసం చేసుకునేందుకు బీజేపీ వ్యూహరచన చేసింది. మరోవైపు, లోక్‌సభ ఎన్నికలను పక్కన పెడితే, ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల, జమ్మూ కాశ్మీర్‌లో పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఎన్నికల ప్రచార కమిటీకి నాయకత్వం వహించడానికి నిరాకరించారు. హిమాచల్ ప్రదేశ్‌లో సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ ఎన్నికల స్టీరింగ్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం ద్వారా పార్టీ హైకమాండ్‌ను గందరగోళంలో పడేసిన ఈ ఎదురుదెబ్బ నుండి కాంగ్రెస్ ఇంకా కోలుకోవడం కష్టంగా మారనుంది. ముందే కాంగ్రెస్‌ పార్టీకి గడ్డుకాలం అంటే.. పార్టీ పగ్గాలు అప్పగించేందుకు అష్టకష్టాలు పడుతోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవ్వరికి అప్పగిస్తారన్న సందేహం వ్యక్తం అవుతోంది. రాహుల్‌ గాంధీకే పార్టీ పగ్గాలు అప్పగించాలన్న అభిప్రాయం అందరిలో వ్యక్తం అవుతుండగా, అందుకు రాహుల్‌ అంగీకరించే ఆలోచన లేనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

అయితే ఆగస్టు 21- సెప్టెంబర్ 20 మధ్య కొత్త పార్టీ అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను ప్రకటించాల్సి ఉంది. దీనిపై ఆదివారం నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో 2024 వరకు సోనియా గాంధీని పదవిలో కొనసాగించాలని పార్టీలోని నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో అనారోగ్య కారణాలతో సోనియాగాంధీ ఆ పదవిలో కొనసాగేందుకు ఇష్టపడటం లేదు. మరి తదుపరి అధ్యక్షుడి బాధ్యతలు ఎవరికి అప్పగిస్తుందనేదాని గురించి వేచి చూడాల్సిందే.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి