చెరువులో మునిగి ఐదుగురు మృతి.. మృతులందరూ ఒక కుటుంబానికి చెందినవారే

నాందేడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

చెరువులో మునిగి ఐదుగురు మృతి.. మృతులందరూ ఒక కుటుంబానికి చెందినవారే
Crime News
Follow us
Ganesh Mudavath

| Edited By: Ravi Kiran

Updated on: Aug 22, 2022 | 7:04 AM

నాందేడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఒకరి తర్వాత ఒకరు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మృతుల కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందేడ్ వద్ద ఉన్న దర్గా దర్శనం చేసుకునేందుకు కుటుంబసభ్యులు పయనమయ్యారు. ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో భోజనం చేసేందుకు ఆగారు. కంధర్ చెరువు వద్ద వాహనాన్ని నిలిపారు. ఈ క్రమంలో టిఫిన్ బాక్సును కడిగేందుకు ఒకరు చెరువు వద్దకు వెళ్లారు. ప్రమదావశాత్తు అందులో మునిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన మిగతా కుటుంబసభ్యులు నీటిలో పడిపోయిన వ్యక్తిని కాపాడేందుకు వెళ్లారు.

ఇద్దరు వ్యక్తులు నీటిలో దూకారు. వీరంతా మునిగిపోవడం చూసి.. ఒడ్డున ఉన్న మరో ఇద్దరూ నీళ్లలోకి దూకారు. వారు కూడా నీటిలో మునిగి మృతి చెందారు. ఇలా ఒకరి తర్వాత మరొకరు ఐదుగురు చెరువులో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి