Accident: ఉలిక్కిపడ్డ టర్కీ.. గంటల వ్యవధిలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 32 మంది దుర్మరణం
టర్కీలో (Turkey) రోడ్డు ప్రమాదాలు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అచ్చం సినిమాల్లో కనిపించే స్టంట్స్‌ను తలపించాయి ఆ రోడ్డు ప్రమాదాలు. టర్కీలో జరిగిన..
టర్కీలో (Turkey) రోడ్డు ప్రమాదాలు బీభత్సం సృష్టించాయి. రెండు వేర్వేరు ప్రమాదాల్లో 32 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అచ్చం సినిమాల్లో కనిపించే స్టంట్స్‌ను తలపించాయి ఆ రోడ్డు ప్రమాదాలు. టర్కీలో జరిగిన ఈ ప్రమాదాలు ప్రత్యక్షంగా చూసిన వారిని తీవ్ర ఆందోళనకు గురి చేశాయి. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ రోడ్డు ప్రమాదాల బారినపడి 32 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. గాజియాంటెప్ ప్రావిన్స్‌లోని నిజిప్ సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆగి ఉన్న వాహనాలపై బస్సు వేగంగా దూసుకువచ్చింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. మరో 21 మంది గాయపడ్డారు. మరణించిన వారిలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు అత్యవసర కార్మికులు, ఇద్దరు జర్నలిస్టులు ఉన్నారని గాజియాంటెప్ గవర్నర్ తెలిపారు. ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగులు తీసినా ప్రయోజనం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి ప్రమాదం జరిగిన కొద్ది గంటల్లోనే మార్డిన్ ప్రావిన్స్‌లోని డెరిక్ పట్టణంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ గ్యాస్ స్టేషన్‌కు సమీపంలో ప్రజల మీదకు ఓ ట్రక్కు దూసుకువచ్చింది. ఈ ఘటనలో 16 మంది మరణించారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఓ అంబులెన్స్ కూడా ఈ ప్రమాదంలో పూర్తగా ధ్వంసమైపోయింది. అందులోని అత్యవసర సిబ్బంది కూడా ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాదాలపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం