Uttar Pradesh: యువకుడికి ఘోర అవమానం.. చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ.. భగ్గుమన్న సంఘాలు

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగతి సాధిస్తున్నా.. అభివృద్ధి ఎంత వేగంగా దూసుకెళ్తున్నా కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం ఇప్పటికీ పురుడు పోసుకుంటోంది. గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ..

Uttar Pradesh: యువకుడికి ఘోర అవమానం.. చెప్పుతో కొడుతూ వీడియో తీస్తూ.. భగ్గుమన్న సంఘాలు
Attack On Young Man
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 22, 2022 | 7:27 AM

శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగా పురోగతి సాధిస్తున్నా.. అభివృద్ధి ఎంత వేగంగా దూసుకెళ్తున్నా కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాల జాఢ్యం ఇప్పటికీ పురుడు పోసుకుంటోంది. గ్రామాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కులం పేరుతో గొడవలు, వర్గం పేరుతో విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా పరిగణిస్తున్న భారత్ లో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ఘటనే జరిగింది. పెద్ద మనుషులుగా చెప్పుకునే కొంత మంది గ్రామ పెద్దలు ఓ దళిత యువకుడి పట్ల తీవ్ర అవమానకరంగా ప్రవర్తించారు. అతడిపై దాడి చేశారు. దృశ్యాలను వీడియో తీశారు. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది.. ఈ వీడియో వైరల్ గా మారడంతో పాటు పోలీసులకూ చేరింది. దీంతో నిందితులపై కఠిన చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందిన దినేశ్ కుమార్‌ పై తాజ్‌పుర్‌ గ్రామ సర్పంచ్‌ శక్తి మోహన్‌ గుర్జార్‌, మరో ఇద్దరు దాడి చేశారు. చెప్పులతో కొడుతూ చంపేస్తామని బెదిరించారు. ఈ ఘటనతో గ్రామంలోని ఎస్సీ వర్గాన్ని తమ అధీనంలో ఉంచుకోవాలని ప్రయత్నించారు. దీంతో యువకుడిని కొడుతున్న దృశ్యాలను ఫోన్ లో రికార్డు చేశారు. అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. అవి వైరల్ గా మారాయి.

వీడియో చూసిన అధికారులు ఘటనను తీవ్రంగా పరిగణించారు. భారతీయ శిక్షా స్మృతి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నిందితులపై కేసులు నమోదు చేశారు. గ్రామ సర్పంచ్‌ ను అరెస్ట్‌ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారని, వారినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. యువకుడిపై దాడి ఘటనపై స్థానిక వర్గాలు భగ్గుమన్నాయి. భీమ్‌ ఆర్మీ కార్యకర్తలు ఛాపర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు. యువకుడిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి