NTR – Amit Shah: తారకరాముడికి కేంద్ర హోమంత్రి నుంచి అనూహ్య ఆహ్వానం.. రీజన్ ఇదేనా..!

నోవాటెల్‌ హోటల్‌లో రాత్రి 8.30 గంటలకు కేంద్ర హోమంత్రి అమిత్​ షాతో ఎన్టీఆర్‌ భేటీ అవ్వనున్నారు. అమిత్‌షా - ఎన్టీఆర్‌ భేటీని బీజేపీ వర్గాలు కన్ఫామ్ చేశాయి.

NTR - Amit Shah: తారకరాముడికి కేంద్ర హోమంత్రి నుంచి అనూహ్య ఆహ్వానం.. రీజన్ ఇదేనా..!
Amit Shah Ntr
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 21, 2022 | 4:35 PM

జూనియర్‌ ఎన్టీఆర్‌ను తన వైపు తిప్పుకోవాలని బీజేపీ చూస్తోందా? జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా డిన్నర్‌కు పిలవడం వెనుక రాజకీయమేంటి? జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా ప్రత్యేకంగా ఆహ్వానించడం వెనుక మతలబు ఏమైనా ఉందా? పొలిటికల్‌గా ఏం జరుగుతోంది? రాజకీయాలను దూరంగా ఉన్న ఎన్టీఆర్‌ను తన వైపు చేర్చుకోవడం ద్వారా ఏపీ(Andhra Pradesh)లో చక్రం తిప్పాలన్నది బీజేపీ ఆలోచనా? భవిష్యత్‌ రాజకీయ వ్యూహంలో భాగంగానే బీజేపీ కీలక నేత అమిత్‌ షా – జూనియర్‌ ఎన్టీఆర్‌తో భేటీ అవుతున్నారా? అన్ని ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Raj Gopal Reddy)ని బీజేపీ(BJP)లో చేర్చుకునేందుకు మునుగోడు(Munugode) వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. మునుగోడు సభ కంటే కూడా ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌తో అమిత్‌ షా భేటీ కావడం పొలిటికల్‌ టెంపరేచర్‌ను ఒక్కసారిగా పెంచేసింది. మునుగోడు సభ ముగించుకొని రాత్రి ఢిల్లీకి తిరిగివెళ్లే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా కలవనున్నారు. శంషాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో డిన్నర్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ను అమిత్‌ షా ఆహ్వానించారు

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన RRR సినిమాను ఈ మధ్యే అమిత్ షా చూసినట్టు తెలుస్తోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ నటనను అమిత్‌ షా బాగా మెచ్చుకున్నారని బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ TDP తరపున ప్రచారం చేశారు. ఆ ప్రసంగాలు, ప్రచారానికి జనం నుంచి మంచి స్పందనే వచ్చింది కాని ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ ఏ పార్టీకి ప్రచారం చేయలేదు. గతంలో కొన్నాళ్లు టీడీపీ మహానాడుకు హాజరైన గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్‌ అక్కడి కూడా వెళ్లడం లేదు. తాను పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాటని ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్‌ చెప్తున్నారు. ఇప్పుడు అమిత్‌ షాతో భేటీ అవుతుండటంతో రాజకీయాల వైపు మళ్లీ చూస్తున్నారా అని సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఈ డిన్నర్‌ మీటింగ్‌లో ఏం జరగబోతోంది? భవిష్యత్‌ రాజకీయాలకు ఈ విందు సమావేశం వేదికగా నిలుస్తుందా అన్నది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి