Telangana: అన్నీ లాస్ట్.. కర్తవ్యమే ఫస్ట్.. వరదల్లో వెలుగులు నింపి రియల్ హీరోగా నిలిచిన విద్యుత్ ఉద్యోగి..
మహబూబాబాద్, జులై 30: అతనికి డ్యూటీ.. ప్రాణంకంటే ఎక్కువ.. డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాం అనేవారు ఉంటారు. ఈ విద్యుత్ ఉద్యోగి చేసిన సాహసంను ఎవ్వరైనా సరే ప్రశంసించాల్సిందే.. భారీవర్షాలతో ఆ గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆ ఊరికి ఎలాగైన విద్యుత్ అందించాలని ఆ విద్యుత్ ఉద్యోగి చూపిన తెగువ, వృత్తిపట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది.
మహబూబాబాద్, జులై 30: అతనికి డ్యూటీ.. ప్రాణంకంటే ఎక్కువ.. డ్యూటీ కోసం ప్రాణాలు ఇస్తాం అనేవారు ఉంటారు. ఈ విద్యుత్ ఉద్యోగి చేసిన సాహసంను ఎవ్వరైనా సరే ప్రశంసించాల్సిందే.. భారీవర్షాలతో ఆ గ్రామం వరదనీటిలో చిక్కుకుపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఆ ఊరికి ఎలాగైన విద్యుత్ అందించాలని ఆ విద్యుత్ ఉద్యోగి చూపిన తెగువ, వృత్తిపట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని తెలియజేస్తుంది. భారీ వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో కరెంట్ స్థంబాలు కూలిపోయి, విద్యుత్ వైర్లు తెగిపోయి, చెట్లు కూలి పలు గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఓ విద్యుత్ ఉద్యోగి చేసిన పనికి సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఆ ఉద్యోగి ఏం చేశాడంటే.. భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వర్షంలో విద్యుత్ స్థంబాలను ముట్టుకోకూడదని ప్రజలకు పలు సూచనలు చేసింది. కాగా, వర్షాల వల్ల దెబ్బతిన్న కరెంట్ పోల్స్ ను, ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ తీగలను పునరుధ్దరించే పనిలో విద్యుత్ అధికారులు నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో కరెంట్ హెల్పర్ శ్రీకాంత్ ప్రాణాలకు తెగించాడు. భారీ వరద నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి కరెంట్ తీగలను సరిచేసి గ్రామానికి కరెంట్ వచ్చేలా చేశాడు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలాన్ని వరదలు ముంచెత్తాయి. అయితే వరద నీటి మధ్యలోని ఓ స్తంభం వద్ద వైర్లు తెగిపోవడంతో కొత్తగూడ మండలానికి విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. దీంతో విద్యుత్ ఉద్యోగి శ్రీకాంత్ ప్రాణాలకు తెగించి వరదనీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తులు చేశాడు.. అతని సాహసం ఊళ్ళో వెలుగులు నింపింది.. దీంతో అంధకారంలో ఉన్న కొత్తగూడ గ్రామానికి కరెంట్ వచ్చింది. విద్యుత్ ఉద్యోగి శ్రీకాంత్ చేసిన సాహసానికి గ్రామ ప్రజలు, అధికారులు అభినందిస్తున్నారు.
శ్రీకాంత్ సాహసానికి హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు చాలా మంది ప్రశంసిస్తుండటతో విద్యుత్ శాఖలో అతను రియల్ హీరోగా మారడంటున్నారు గ్రామస్థులు.. వానలు వరదలు వరంగల్ ఉమ్మడి జిల్లాను ముంచెత్తిన సమయంలో విద్యుత్ ఉద్యోగి ప్రదర్శించిన సాహసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..