Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: లేచిపోయిన బస్సు టాప్ గురించి స్పందించిన అధికారి.. బస్సుల పరిస్థితి దారుణంగా ఉందని సిబ్బంది ఆందోళన

MSRTC అధికారి మాట్లాడుతూ బస్సు నిర్వహణ సరిగా లేని కారణంగా గడ్చిరోలిలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వాహనం పైకప్పు మొత్తం బయటకు రాలేదని..  హైవేపై బస్సు నడుస్తుండగా డ్రైవర్ క్యాబిన్ పైన ఉన్న ఔటర్ ఫైబర్ భాగం మాత్రమే విరిగిపోయి గాలికి ఎగిరిందని తెలిపారు.

Watch Video: లేచిపోయిన బస్సు టాప్ గురించి స్పందించిన అధికారి.. బస్సుల పరిస్థితి దారుణంగా ఉందని సిబ్బంది ఆందోళన
Msrtc Bus
Follow us
Surya Kala

|

Updated on: Jul 30, 2023 | 7:40 AM

ఆర్టీసీ బస్ అంటేనే సురక్షితం అని ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఎక్కకుండా ఈ బస్సుల కోసమే ఎదురు చూస్తారు. అంత నమ్మకం ఆర్టీసీ బస్ అంటే. కానీ ఓ బస్ డ్రైవర్ నిర్వాకం వల్ల ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని హహాకారాలు చేయాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వెలుగు చూసిన ఘటన ఆర్టీసీలో కలకలం సృష్టించింది. 40 మంది ప్రయాణికులతో బస్సు గడ్చిరోలి-అహేరి మార్గంలో వెళ్తున్న ఓ ఆర్టీస్ బస్సు రూఫ్ లేచిపోయింది. అయినా డ్రైవర్ బస్‌ను ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆ రూఫ్ ఊడి మీదపడిపోతుందనే భయంతో అందులోని ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. అయినా డ్రైవర్ బస్ ఆపకపోవడంతో ఆందోళనకు గురైన ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించాడు.

వెంటనే అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు బస్‌ను నిలిపివేసి ప్రయాణికులను మరో బస్‌లో గమ్యస్థానానికి చేర్చారు. అనంతరం MSRTC వైస్ చైర్మన్ శేఖర్ ఛన్నే మాట్లాడుతూ ప్రయాణికుల భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని మీడియాతో చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరో MSRTC అధికారి మాట్లాడుతూ బస్సు నిర్వహణ సరిగా లేని కారణంగా గడ్చిరోలిలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఒక అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. వాహనం పైకప్పు మొత్తం బయటకు రాలేదని..  హైవేపై బస్సు నడుస్తుండగా డ్రైవర్ క్యాబిన్ పైన ఉన్న ఔటర్ ఫైబర్ భాగం మాత్రమే విరిగిపోయి గాలికి ఎగిరిందని తెలిపారు. బస్సు పైకప్పు లోపలి పొర చెక్కుచెదరకుండా ఉందని అధికారి తెలిపారు.

అంతేకాదు వాస్తవానికి “బస్సు సిబ్బందికి, ప్రయాణికులకు విరిగిన పైకప్పు గురించి తెలియదు. అయితే అటుగా వెళ్తున్న కొన్ని ఇతర వాహనంలోని ప్రయాణీకులు బస్ సిబ్బందికి ఈ విషయం చెప్పిన అనంతరం వారికీ తెలిసింది.

MSRTC దేశంలోని అతిపెద్ద ప్రజా రవాణా సంస్థల్లో ఒకటి. 15,000 కంటే ఎక్కువ బస్సులు ఉన్నాయి. ప్రతిరోజూ 60 లక్షల మంది ప్రయాణీకులను రవాణా చేస్తుంది. MSRTCలోని ఒక యూనియన్ నాయకుడు మాట్లాడుతూ.. పేలవమైన నిర్వహణ కారణంగా రాష్ట్ర రవాణా బస్సుల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ముఖ్యంగా మహమ్మారి తర్వాత పరిస్థితి దారుణంగా మారిందని.. బస్సులు లీక్ కావడం వల్ల చాలా మంది ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..