AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Osmania University: స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్…హాస్టల్స్ కి నో సమ్మర్ హాలిడేస్ హాస్టల్ మెస్ ఓపెన్

విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వేసవి సెలవుల కాలంలో యూనివర్సిటీ హాస్టల్‌లు పనిచేస్తాయని ప్రకటించింది. ఈ నిర్ణయం క్యాంపస్‌లో తిరిగి ఉండాలనుకునే విద్యార్థులకు వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది. వారి పరీక్ష ప్రిపరేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని విద్యార్థులు ఈ సమ్మర్ హాలిడేస్ లో హాస్టల్ లోనే ఉండవచ్చునని యూనివర్సిటీ రిజిస్టార్ ఓ ప్రకటన జారీ చేశారు.

Osmania University: స్టూడెంట్ కోసం యూనివర్సిటీ బంపర్ ఆఫర్...హాస్టల్స్ కి నో సమ్మర్ హాలిడేస్ హాస్టల్ మెస్ ఓపెన్
Osmania University
Sravan Kumar B
| Edited By: |

Updated on: Apr 30, 2024 | 6:45 PM

Share

వేసవి సెలవుల్లో విద్యార్థుల కోసం యూనివర్సిటీ హాస్టళ్లు తెరిచే ఉంటాయని యూనివర్సిటీ రిజిస్టర్ తెలిపారు. యూనివర్సిటీలో కరెంటు, నీటి కొరత ఉన్న కారణంగా హాస్టల్స్ కి హాలిడేస్ ప్రకటిస్తున్నట్టుగా , దానికి యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ అంశం రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో కరెంటు, నీటి కొరత ఏర్పడిందని , ఇందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణం అంటూ ప్రతిపక్షం ఆరోపణలకు దిగింది. దీంతో ఆరోపణలను ఖండిస్తూ, ప్రతిపక్షం ఆరోపణలపై అధికార కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత సమ్మర్ సీజన్లో కూడా మీరు ఇలాగే సెలవులు ప్రకటించారని వాస్తవానికి, ఇప్పుడు యూనివర్సిటీలో ఎటువంటి నీటి కొరత, కరెంటు కొరత లేదని ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాలిడేస్ ప్రకటించిన 2013 లెటర్ ని ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీంతో యూనివర్సిటీలో విద్యార్థులు రెండు టీంలుగా విడిపోయి అధికార ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఏర్పాడ్డారు.

రేవంత్ సర్కార్ ఈ విషయంపై దృష్టి సారించి విచారణ జరిపింది. యూనివర్సిటీలో ఎటువంటి నీటి సమస్య విద్యుత్ సమస్య లేదని  నిర్ధారించింది. వేసవి సెలవుల కోసమని 15 రోజులు యూనివర్సిటీ మెస్ కి ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయంపై యూనివర్సిటీ రిజిస్టర్ కూడా ఒక ప్రకటన చేశారు.

స్టాండర్డ్ అకడమిక్ క్యాలెండర్‌లో భాగంగా 2024 మే 1 నుండి 31 మే 2024 వరకు వేసవి సెలవుల కాలం ప్రారంభమవుతుందని విశ్వవిద్యాలయం ప్రకటించింది. సాధారణంగా , ఈ కాలం విద్యార్థులు తాత్కాలికంగా విశ్వవిద్యాలయ హాస్టళ్లను ఖాళీ చేసి వెళ్ళిపోతారు. తమ కుటుంబాలతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించే లేదా వివిధ పాఠ్యేతర కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళుతుంటారు. ఈ సమయంలో క్యాంపస్ లో చిన్న చిన్న మరమ్మతులు చేయడానికి ఇతర మెయింటనెన్స్ పనులకు విశ్వవిద్యాలయ పరిపాలనకు సులభంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఈసారి మాత్రం విద్యార్థి సంఘం  విభిన్న విద్యా అవసరాలను పరిగణలోకి తీసుకొని, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ మరో నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వేసవి సెలవులను వివిధ పోటీ పరీక్షలను లక్ష్యంగా చేసుకుని ఇంటెన్సివ్ ప్రిపరేషన్ కోసం హాస్టల్ ని, మెస్ ని ఓపెన్ చేసి ఉంచాలని కోరారు. వారి అభ్యర్థన ప్రాముఖ్యతను, వారి విద్యా విషయాల పట్ల నిబద్ధతను గుర్తించి, విశ్వవిద్యాలయ పరిపాలన పరిస్థితిని క్షుణ్ణంగా సమీక్షించింది యూనివర్సిటీ.

విద్యార్థుల సౌకర్యార్థం యూనివర్శిటీ అడ్మినిస్ట్రేషన్ వేసవి సెలవుల కాలంలో యూనివర్సిటీ హాస్టల్‌లు పనిచేస్తాయని ప్రకటించింది. ఈ నిర్ణయం క్యాంపస్‌లో తిరిగి ఉండాలనుకునే విద్యార్థులకు వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది. వారి పరీక్ష ప్రిపరేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని విద్యార్థులు ఈ సమ్మర్ హాలిడేస్ లో హాస్టల్ లోనే ఉండవచ్చునని యూనివర్సిటీ రిజిస్టార్ ఓ ప్రకటన జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..