మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..! ఈ పచ్చటి ఆకుపొడితో ఇంట్లోనే తయారు చేసుకోండిలా..

రోజ్మేరీలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. రోజ్మేరీని చర్మ ఉత్పత్తుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మొటిమలు, జిడ్డుగల చర్మ వారికి ఎక్కువ మేలు చేస్తుంది. మీరు ఇంట్లోనే మొటిమలు లేకుండా, మెరిసే చర్మాన్ని పొందడానికి ట్రై చేస్తున్నట్టయితే.. ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన రోజ్మేరీ ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి.

మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం అద్భుత ఫేస్‌ ప్యాక్‌..! ఈ పచ్చటి ఆకుపొడితో ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
Rosemarry Face Packs
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 30, 2024 | 5:17 PM

జుట్టు, చర్మ సంరక్షణకు అత్యంత శక్తివంతమైన పదార్థాలలో ఒకటి రోజ్‌మేరీ. ఇది మొత్తం మీ ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుందని మీకు తెలుసా..? రోజ్మేరీ రోగనిరోధక వ్యవస్థ, గుండె ఆరోగ్యాన్ని పెంచే శోథ నిరోధక సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. చర్మ సంరక్షణ విషయానికి వస్తే, రోజ్మేరీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజ్మేరీని ముఖంపై అప్లై చేసినప్పుడు, మసాజ్ చేసినప్పుడు, మచ్చలను తగ్గించడానికి, నల్లటి మచ్చలను తేలికగా క్లీయర్‌ చేస్తుంది. మొటిమల వల్ల ఏర్పడ్డ మచ్చలను తగ్గించడానికి రోజ్మేరీ సహాయపడుతుంది. రోజ్మేరీలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు జిడ్డు చర్మాన్ని నివారించడంలో, చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి. రోజ్మేరీని చర్మ ఉత్పత్తుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా మొటిమలు, జిడ్డుగల చర్మ వారికి ఎక్కువ మేలు చేస్తుంది. మీరు ఇంట్లోనే మొటిమలు లేకుండా, మెరిసే చర్మాన్ని పొందడానికి ట్రై చేస్తున్నట్టయితే.. ఇక్కడ కొన్ని ప్రభావవంతమైన రోజ్మేరీ ఫేస్ ప్యాక్‌లు ఉన్నాయి.

రోజ్మేరీ, పెరుగు:

ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం కొన్ని చుక్కల రోజ్మేరీ ఆయిల్, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడిని తీసుకుని, ఈ రెండింటినీ బాగా కలపండి. చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. దీన్ని మీ ముఖంపై అప్లై చేసి సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బాగా ఆరిన తర్వాత సాధారణ నీటితో కడగాలి.

ఇవి కూడా చదవండి

2. రోజ్మేరీ, తేనె:

రెండు చెంచాల రోజ్మేరీ పొడిని ఒక గిన్నెలో తీసుకుని, ఒక చెంచా తేనెతో కలపండి. బాగా కలిపిన తర్వాత, మిశ్రమాన్ని మీ ముఖంపై సమానంగా అప్లై చేసుకోండి. దాదాపు 15 నిమిషాల పాటు అలాగే ఉంచి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

3. రోజ్మేరీ, వోట్మీల్:

రోజ్మేరీ, ఓట్మీల్ ఫేస్ ప్యాక్ చర్మం కాంతివంతంగా, టాన్ తొలగించేందుకు ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందుకోసం కొంచెం ఓట్ మీల్ తీసుకుని గ్రైండర్ లో రుబ్బుకోవాలి. ఒక చెంచా రోజ్మేరీ పౌడర్‌తో కలపండి. మందపాటి పేస్ట్‌ను తయారు చేసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలపండి. ఈ పదార్థాలన్నీ బాగా కలిసిపోయేలా మిక్స్‌ చేయాలి.. దీన్ని మీ ముఖానికి పట్టించి, సుమారు 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

4. రోజ్మేరీ, అలోవెరా:

రోజ్మేరీ, కలబంద మిశ్రమం చర్మం సహజ నూనెను పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్, రోజ్మేరీ పౌడర్ సమాన పరిమాణంలో తీసుకుని బాగా కలపాలి. పేస్ట్ సిద్ధమైన తర్వాత, మీ ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి.

5. రోజ్మేరీ, ముల్తానీ మిట్టి:

రోజ్మేరీ పొడి, ముల్తానీ మిట్టి సమాన మొత్తంలో తీసుకుని ఒక చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్‌ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. అది ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!