Tourist Taxi Falls Into River: మంచు ఎఫెక్ట్‌..! టూరిస్ట్ టాక్సీకి ఘోర ప్రమాదం.. నదిలో పడి ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే..

గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది నదిని జల్లెడ పడుతున్నారు. ట్యాక్సీలో తొమ్మిది మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ప్రమాదంలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు.

Tourist Taxi Falls Into River: మంచు ఎఫెక్ట్‌..! టూరిస్ట్ టాక్సీకి ఘోర ప్రమాదం..  నదిలో పడి ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే..
Tourist Taxi Falls Into Riv
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 29, 2024 | 12:29 PM

జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పర్యాటకులతో నిండిన ట్యాక్సీ నదిలో పడిపోయిన షాకింగ్ సమాచారం వెలుగులోకి వచ్చింది. శ్రీనగర్‌లోని సోన్‌మార్గ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం అందింది.. టాక్సీ నదిలో పడిపోవడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడగా, ఇద్దరు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రారంభించారు. మంచు మీదుగా వెళ్తున్న టాక్సీ అదుపు తప్పి నదిలో పడిపోయినట్టుగా తెలిసింది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తోంది.

అందిన సమాచారం ప్రకారం, ఆదివారం సింధ్ నది సమీపంలో ప్రయాణికులతో వెళ్తు్న టాక్సీ అదుపుతప్పటంతో ప్రమాదం జరిగింది. సోన్‌మార్గ్ జిల్లా గందర్‌బాల్‌లోని గగాంగిర్ వద్ద ట్యాక్సీ టవేరా నదిలో పడిపోయింది. నది ఉధృతంగా ప్రవహించడంతో ట్యాక్సీలోని ప్రయాణికులు కొట్టుకుపోయారు. సింధ్ నది సమీపంలో జరిగిన ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిఆర్ఎఫ్ జవాన్లు (రెస్క్యూ ఆపరేషన్స్), పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో భారీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌కు గాయాలైనట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

గాయపడిన ఇద్దరిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది నదిని జల్లెడ పడుతున్నారు. ట్యాక్సీలో తొమ్మిది మంది పర్యాటకులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. ప్రమాదంలో మృతి చెందిన పర్యాటకుల కుటుంబాలకు పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..