ఓరీ దేవుడో.. రస్క్ తింటే రిస్క్ తప్పేలా లేదు..! తయారీ వీడియో చూస్తే భయంతో పారిపోవాల్సిందే..!!
ఆ తరువాత సంచులకొద్దీ పిండిని కూడా వేశారు. కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తూ మిషన్ తో బాగా మిక్స్ చేశారు. ఆ తరువాత పిండిని మరో పెద్ద బౌల్ లాంటి దాంట్లోకి తీసుకున్నారు.. ఒక్కొక్కరు ఆ పిండిని పెద్ద సైజు ముద్దలుగా తీసుకుని పొడవుగా చేశారు. దాన్ని బ్రెడ్ ట్రేలో సర్దుబాటు చేసి బట్టీలో కాల్చారు.. అప్పుడు బ్రెడ్ తయారైంది.. ఆ తరువాత దాన్ని చిన్న సైజు టోస్ట్‌లుగా కట్ చేశారు. తిరిగి వాటిని మళ్లీ
రస్క్ అనేది మన దేశంలోనే బాగా ప్రాచుర్యం పొందిన చిరుతిండి. దీనిని చాలా మంది ఉదయం, సాయంత్రం టీతో తింటారు. దీని రుచి చాలా మందిని తనవైపు ఆకర్షిస్తుంది. పిల్లలు, వృద్ధులు, చిన్నవారు అనే తేడా లేకుండా అన్ని వయసుల వారు ఈ టోస్ట్ తినటానికి ఇస్టపడతారు. అయితే, ఇంతటి ప్రాచుర్యం పొందిన రస్క్‌ని ఎలా తయారుచేస్తారో ఎప్పుడైనా చూశారా..? రస్క్ తయారీలో ఉపయోగించే పదార్థాలేంటో తెలుసా..? దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వైరల్‌గా మారింది. వీడియో క్యాప్షన్‌లో ఇలా రాసి ఉంది.. రస్క్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మనం ఉదయం టీతో తింటాము. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదని భావిస్తాము. కానీ, రస్క్‌లో పామాయిల్, చక్కెర, మైదా పిండిని ఎక్కువ మొత్తంలో కలిపి తయారు చేస్తారని తెలిస్తే షాక్ అవుతారు.
రస్క్ బిస్కెట్లలో ఈస్ట్, షుగర్, పామాయిల్ వంటి నూనెలు, పెద్ద మొత్తంలో పిండిని వాడుతున్నారు. కానీ చాలా దుకాణాల్లో పాతది అంటూ మిగిలిపోయన బ్రెడ్‌తో రస్క్ బిస్కెట్‌లను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. వాస్తవానికి, రస్క్‌లు గ్లూటెన్‌తో ఈ పదార్థాలను కాల్చటం ద్వారా తయారు చేస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు.
వైరల్ వీడియోలో ఒక పెద్ద పిండి మిక్సింగ్ మిషన్ కనిపిస్తుంది. అందులో ఎక్కువ మొత్తంలో ముందుగా ఆయిల్ పోశారు సిబ్బంది. ఆ తరువాత అందులోనే డబ్బాల కొద్దీ షుగర్ యాడ్ చేశారు. ఆ తరువాత సంచులకొద్దీ పిండిని కూడా వేశారు. కావాల్సిన అన్ని ఇంగ్రీడియెంట్స్ వేస్తూ మిషన్ తో బాగా మిక్స్ చేశారు. ఆ తరువాత పిండిని మరో పెద్ద బౌల్ లాంటి దాంట్లోకి తీసుకున్నారు.. ఒక్కొక్కరు ఆ పిండిని పెద్ద సైజు ముద్దలుగా తీసుకుని పొడవుగా చేశారు. దాన్ని బ్రెడ్ ట్రేలో సర్దుబాటు చేసి బట్టీలో కాల్చారు.. అప్పుడు బ్రెడ్ తయారైంది.. ఆ తరువాత దాన్ని చిన్న సైజు టోస్ట్‌లుగా కట్ చేశారు. తిరిగి వాటిని మళ్లీ రోస్ట్ చేశారు. ఇదంతా వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.
View this post on Instagram
వైరల్ వీడియో చూసిన నెటిజన్లు బాబోయ్ ఇదేం ఆయిల్‌రా సామీ అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదని భావించి లాగించే రస్క్ తయారీ వెనుక ఇంత అనారోగ్యం దాగివుందా అనే భయం పట్టుకుందని అంటున్నారు. అందుకే రస్క్ బిస్కెట్లు వదిలి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలని డైటీషియన్ సలహా ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..