AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Shawarma: ప్రాణాలు మీదకు తెస్తున్న చికెన్‌ షావర్మా..! 12మందికి తీవ్ర అస్వస్థత..

గతంలోనూ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చికెన్ షవర్మా తిని వ్యక్తులు మృతిచెందిన వార్తలు వచ్చాయి. షవర్మా తిని ప్రజల ఆరోగ్యం క్షీణించిందని వరుసగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా నగర కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు సంబంధిత హోటళ్లను  మూసివేయించారు. ఇప్పుడు కూడా చికెన్ షవర్మ తిన్న 12 మంది ఆస్పత్రిపాలయ్యారు. 

Chicken Shawarma: ప్రాణాలు మీదకు తెస్తున్న చికెన్‌ షావర్మా..! 12మందికి తీవ్ర అస్వస్థత..
Chicken Shawarma
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2024 | 11:40 AM

Share

రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్న చికెన్‌ షావర్మా తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ షాకింగ్ ఘటన ముంబైలోని గోరేగావ్‌లో చోటుచేసుకుంది. గోరేగావ్ తూర్పు ప్రాంతంలో చికెన్ షోర్మా తిని 12 మంది తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన గోరేగావ్‌లోని సంతోష్‌నగర్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన వారందరినీ హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు. బాధితులకు అత్యవసర చికిత్స అందించారు.. వీరిలో 9 మంది చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు వ్యక్తులు ఇంకా చికిత్స పొందుతున్నారు. ముగ్గురు స్వప్నిల్ దహనుకర్, ముస్తాక్ అహ్మద్, సుజిత్ జైస్వాల్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

బృహన్‌ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గోరేగావ్ తూర్పు సంతోష్ నగర్‌లోని గోల్డెన్ బార్ ఎదురుగా ఉన్న శాటిలైట్ టవర్ వద్ద చికెన్ షావర్మ తిని మొత్తం పన్నెండు మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 27 న మరో ఇద్దరు వ్యక్తులు షావర్మ తిన్న అనంతరం అనారోగ్యం సమస్యతో బాధపడినట్టుగా తెలిసింది. వారు కూడా ఆస్పత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. 12 మందిలో తొమ్మిది మంది ఇప్పుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు ఇప్పటికీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలిసింది. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో చికెన్ షవర్మా తిని వ్యక్తులు మృతిచెందిన వార్తలు వచ్చాయి. షవర్మా తిని ప్రజల ఆరోగ్యం క్షీణించిందని వరుసగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా నగర కార్పొరేషన్ ఆరోగ్య అధికారులు సంబంధిత హోటళ్లను  మూసివేయించారు. ఇప్పుడు కూడా చికెన్ షవర్మ తిన్న 12 మంది ఆస్పత్రిపాలయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..