Cleaning Hacks: పాత్రల నుండి గుడ్డు వాసన వస్తోందా..? అయితే ఈ సింపుల్ టిప్స్ మీకోసమే.. !
మాంసాహారం వండిన తరువాత పాత్రల నుండి వచ్చే దుర్వాసనతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నాట్టయితే, ఈ కథనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కడిగిన తరువాత కూడా పాత్రల నుంచి వచ్చే చేపలు, గుడ్ల వాసనను నిమిషాల వ్యవధిలో వదిలించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటితో మీ పాత్రలు ఫ్రేష్ స్మెల్‌తో శుభ్రంగా కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మాంసాహారప్రియులు చాలామంది తమ ఇళ్లల్లో చికెన్, చేపలు, గుడ్లు వంటివి ఎక్కువగా వండుకుని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇంట్లో నాన్ వెజ్ చేయడం వల్ల ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే పాత్రలు కడిగిన తర్వాత కూడా కొన్ని సార్లు వింత కుళ్ళిన వాసన వస్తూ ఉంటుంది. అంతే కాదు, ఈ వాసన పాత్రలకు మాత్రమే కాకుండా మెల్లిగా వంటగది అంతటా వ్యాపిస్తుంది. మాంసాహారం వండిన తరువాత పాత్రల నుండి వచ్చే దుర్వాసనతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నాట్టయితే, ఈ కథనం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కడిగిన తరువాత కూడా పాత్రల నుంచి వచ్చే చేపలు, గుడ్ల వాసనను నిమిషాల వ్యవధిలో వదిలించుకోవడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. వాటితో మీ పాత్రలు ఫ్రేష్ స్మెల్‌తో శుభ్రంగా కనిపిస్తాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నిమ్మకాయ ఆహారంలో మాత్రమే కాకుండా వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ పాత్రల నుంచి వచ్చే చేపలు, గుడ్డు వాసన పోవాలంటే పాత్రలో కొద్దిగా నిమ్మరసం వేసి కాసేపు వదిలివేయండి. ఆ తర్వాత పాత్రను స్క్రబ్ చేసి కడగాలి. నిజానికి నిమ్మకాయలో ఉండే సహజ యాసిడ్ వాసనను సులభంగా తొలగిస్తుంది.
పాత్రల నుంచి వచ్చే వాసనను తొలగించడంలో ఉప్పు ప్రభావవంతంగా పనిచేస్తుంది. చేపలు లేదా గుడ్లు వండినప్పుడు వాటిని క్లీన్ చేయటానికి ముందు ఆ పాత్రలో కొద్దిగా ఉప్పు చల్లుకోండి. కొంత సమయం తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఉప్పు వాసనను గ్రహిస్తుంది. పాత్రలకు తాజా వాసన వస్తుంది.
వంట పాత్రల నుంచి వచ్చే నీసు వాసనను తొలగించడంతో పాటు వంటసోడా పాత్రలను మెరిసేలా చేస్తుంది. పాత్రలు కడగడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసి, పాత్రలను కొంత సమయం పాటు నానబెట్టండి. దీని తర్వాత సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.
వెనిగర్ ఆహారం రుచిని పెంచడమే కాకుండా పాత్రల నుండి వచ్చే మొండి వాసనను కూడా తొలగిస్తుంది. అటువంటి పరిస్థితిలో చేపలు, గుడ్డు వంటి వంటలు చేసిన పాత్రకు కొద్దిగా వెనిగర్ వేసి నీటితో నింపండి. 15-20 నిమిషాల తర్వాత పాత్రలను కడగాలి. వెనిగర్ బలమైన వాసన మాంసం, చేపల దుర్వాసనను తగ్గిస్తుంది.
కాఫీ తాగడానికి మాత్రమే కాదు, పాత్రల నుండి దుర్వాసనను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాత్రలు కడగడానికి నీటిలో ఉపయోగించే నీటిలో కొద్దిగా కాఫీ పొడిని వేసుకోవాలి. ఇది నీటి రంగును కొద్దిగా మారుస్తుంది, కానీ వాసన పూర్తిగా అదృశ్యమవుతుంది. తర్వాత పాత్రను సబ్బుతో కడిగి శుభ్రం చేసుకోవాలి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..