AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Health Tips: వేసవిలో పొరపాటున కూడా పెరుగుతో వీటిని తినకండి.. కఫాన్ని, అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చాలా మంది పెరుగు తినడానికి ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. సోడియం, పొటాషియం, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, విటమిన్ డి వంటి అనేక పోషకాలు పెరుగులో ఉన్నాయి. వేసవిలో ప్రజలు తరచుగా ఆహారంతో పెరుగు తింటారు. లేదా వేసవి దాహార్తిని తీర్చుకోవడనికి పెరుగుని కొన్ని రకాల వస్తువులతో కలిపి తింటారు. అయితే కొందరు పెరుగుతో కొన్ని వస్తువులతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా చేయడం వలన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది పెరుగు.

Surya Kala
|

Updated on: Apr 29, 2024 | 9:32 AM

Share
పెరుగు పోషక గుణాల భాండాగారం. అయితే దీనిలో ఎన్ని ఆరోగ్యకరమైన పోషకాలున్నప్పటికీ..  కొన్ని వస్తువులతో దీనిని తినడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యానికి హాని కలుగుతుంది. పెరుగు ఏయే పదార్థాలతో తినకూడదో ఈ రోజు తెలుసుకుందాం.. 

1 / 6
బరువు తగ్గాలనుకునేవారు పెరుగులో బెల్లం కలిపి తినవద్దు. పెరుగులో బెల్లం కలిపి తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. కనుక ఈరోజే రెండింటినీ కలిపి తినడం మానేయండి. బెల్లం, పెరుగు స్వభావం ఒకదానికొకటి భిన్నంగా ఉంటుంది. ఒకవైపు బెల్లం వేడి స్వభావం కలిగి ఉంటే, పెరుగు చల్లదన గుణం కలిగి   ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే దగ్గు, జలుబు, జ్వరం, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

2 / 6
పాలు ఎప్పుడూ పెరుగుతో కలిపి తినకూడదు. పెరుగు మాత్రమే కాదు, పాలతో పులియబెట్టిన పదార్థాలను తినకూడదు. ఇలా చేయడం వల్ల  కడుపు నొప్పితో పాటు అనేక ఇతర జీర్ణ సమస్యలతో బాధపడవచ్చు.

3 / 6
పెరుగు, టీ రెండూ వ్యతిరేక ప్రభావాలను కలిగి ఉంటాయి. కనుక ఈ కలయిక  జీవక్రియను నెమ్మదిస్తుంది. అంతే కాదు జీర్ణవ్యవస్థ కూడా దీని వల్ల ప్రభావితమవుతుంది.

4 / 6
కొంతమంది మామిడి పండుని పెరుగును కలిపి తింటారు. లేదా మామిడి షేక్ తో పెరుగుని కలిపి తింటారు. . వాస్తవానికి ప్రోటీన్లు పెరుగులో ఉంటాయి. ఇది ఏదైనా పండుతో కలిపిన తర్వాత శరీరంలో కిణ్వ ప్రక్రియకు కారణమవుతుంది. ఇది శరీరంలో అజీర్ణం, ఎసిడిటీ వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.

5 / 6
ఉల్లిపాయ, పెరుగుని ఎప్పుడూ కలిపి ఉపయోగించకూడదు. చాలా మంది ఉల్లిపాయలను తరిగి రైతాలో కలుపుతారు. ఉల్లిపాయ వేడి స్వభావం కలిగి ఉంటుంది. అయితే పెరుగు చల్లగా ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ముఖంపై మొటిమలు, చర్మం చికాకు, అలెర్జీ సమస్యలు కూడా వస్తాయి.

6 / 6