- Telugu News Photo Gallery Cinema photos Sreeleela reportedly on foreign tour after not getting movie offers in Tollywood
Sreeleela: సినిమా ఆఫర్లు నిల్ !! దశ తిరిగేదాకా విదేశాలకు టూర్..
కొన్ని సిచ్యువేషన్స్‌లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా.. ఛిల్ అవ్వాలి..! జపాన్ సినిమా ఫ్లాపైనా.. అందులో కార్తి చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. ఈ డైలాగే ఇప్పుడు శ్రీలీలకు బాగా సెట్టైంది. చేసేందుకు ఏ సినిమా లేకపోవడంతో.. ఛిల్ అవుతున్నారు. దశ తిరిగేవరకు దేశాలు తిరగాలని ఫిక్సయ్యారు శ్రీలీల. ఇంతకీ ఈమె ఏం చేస్తున్నారో తెలుసా..? గతేడాదంతా శ్రీలీలదే.. ముఖ్యంగా 2023 సెకండాఫ్‌లో నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ.
Updated on: Apr 29, 2024 | 1:17 PM

కొన్ని సిచ్యువేషన్స్‌లో మన చేతుల్లో ఏం లేదంటే ఏం చేయాలో చెప్పనా.. ఛిల్ అవ్వాలి..! జపాన్ సినిమా ఫ్లాపైనా.. అందులో కార్తి చెప్పిన ఈ డైలాగ్ బాగా పేలింది. ఈ డైలాగే ఇప్పుడు శ్రీలీలకు బాగా సెట్టైంది. చేసేందుకు ఏ సినిమా లేకపోవడంతో.. ఛిల్ అవుతున్నారు.

దశ తిరిగేవరకు దేశాలు తిరగాలని ఫిక్సయ్యారు శ్రీలీల. ఇంతకీ ఈమె ఏం చేస్తున్నారో తెలుసా..? గతేడాదంతా శ్రీలీలదే.. ముఖ్యంగా 2023 సెకండాఫ్‌లో నెలకో సినిమాలో కనిపించారు ఈ బ్యూటీ. స్కంద, ఆదికేశవ, భగవంత్ కేసరి, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారం ఇవన్నీ 5 నెలల గ్యాప్‌లోనే విడుదలయ్యాయి.

గుంటూరు కారం తర్వాతే శ్రీలీల పూర్తిగా ఖాళీ అయిపోయారు. ఈ టైమ్‌ను కాస్త చదువుకు.. ఇంకాస్త ఎంజాయ్‌మెంట్‌కు వాడేస్తున్నారు ఈ డాక్టర్ బ్యూటీ. ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ సినిమాలు మొదలవ్వడానికి ఇంకా టైమ్ ఉండటంతో.. ఈ గ్యాప్‌లో కోలీవుడ్‌పై ఫోకస్ చేస్తున్నారు శ్రీలీల.

ఇప్పటికే అజిత్ సినిమాలో ఈమె పేరు పరిశీలిస్తున్నారు. మరోవైపు విజయ్‌తో కూడా శ్రీలీల నటించబోతున్నారని తెలుస్తుంది. తమిళంలో బిజీ అయ్యేలోపే.. వచ్చిన హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు శ్రీలీల. రెండేళ్లుగా బ్రేక్ లేకుండా పని చేస్తున్న శ్రీలీల.. ఇప్పుడు ఖాళీ టైమ్ ఎంజాయ్ చేస్తున్నారు.

తాజాగా ఈమె ఛిల్ అవుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. స్విమ్మింగ్ పూల్, పంట పొలాలు.. ఇలా ప్రతీచోట హాయిగా సేద తీరుతున్నారు ఈ సుందరి. సమ్మర్ ట్రిప్ తర్వాత మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేయనున్నారు ఈ బ్యూటీ. అప్పటివరకు ఛిల్ అవ్వడమే పనిగా పెట్టుకున్నారు.




