AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hirsutism in Women: మహిళ ముఖంపై వెంట్రుకలకు కారణం ఏంటో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

ప్రతి స్త్రీకి ముఖంపై వెంట్రుకలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే, ఇది లైట్‌గా ఉంటే ఇబ్బంది లేదు. కానీ, పురుషుల్లో మాదిరిగా గడ్డం, మీసం కనిపించడం వల్ల వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ముఖం మీద వెంట్రుకలు ఎందుకు కనిపిస్తాయి. దానికి కారణం ఏమిటి? ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా.? ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Hirsutism in Women: మహిళ ముఖంపై వెంట్రుకలకు కారణం ఏంటో తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Hirsutism In Women
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2024 | 7:44 AM

Share

ఇటీవల ప్రకటించిన UP బోర్డ్ 10వ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించి టాపర్‌గా నిలిచారు ప్రాచీ నిగమ్. ఆమె ముఖంపై కనిపించిన వెంట్రుకల కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రతి స్త్రీకి ముఖంపై వెంట్రుకలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే, ఇది లైట్‌గా ఉంటే ఇబ్బంది లేదు. కానీ, పురుషుల్లో మాదిరిగా గడ్డం, మీసం కనిపించడం వల్ల వారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు ముఖం మీద వెంట్రుకలు ఎందుకు కనిపిస్తాయి. దానికి కారణం ఏమిటి? ఇది ఏదైనా వ్యాధికి సంకేతమా.? ఇలాంటి విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖంలో వెంట్రుకలు ఎందుకు పెరుగుతాయి?

ఇవి కూడా చదవండి

మహిళల్లో ముఖంపై వెంట్రుకలు పెరగడం చాలా వరకు జన్యుపరంగా కనిపిస్తుంది. అంటే కుటుంబ సభ్యులకు ముఖంలో వెంట్రుకలు ఎక్కువగా ఉంటే, అది స్త్రీలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఇతర వ్యాధులు కూడా దీనికి కారణం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌:

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌ను సాధారణంగా PCOS అంటారు. ఇందులో అండాశయాలలో వాపు ఏర్పడి హార్మోన్లు చెదిరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహిళల ముఖంపై జుట్టు కనిపించడం ప్రారంభమవుతుంది.

మగవారిలో ఉండే హార్మోన్ పెరుగుదల:

చాలా సార్లు మగవారిలో ఉండే హార్మోన్ ‘టెస్టోస్టెరాన్’ ఆడవారి శరీరంలో పెరుగుతుంది. దీని కారణంగా ముఖం, శరీరంలోని ఇతర భాగాలపై ఎక్కువ జుట్టు పెరుగుతుంది. ఈ లక్షణాలు తీవ్ర స్థాయిలో పెరిగినప్పుడు స్త్రీల గొంతులో కూడా మార్పు కనిపిస్తుంది. కొందరు మహిళలు హార్మోనల్ థెరపీని తీసుకున్నప్పుడు కూడా వారి ముఖంపై వెంట్రుకలు పెరగడం సమస్య మొదలవుతుంది. స్త్రీ శరీరంలో అవసరమైన ఎంజైమ్‌లు లేకపోవడం వల్ల, మగ హార్మోన్లు పెరుగుతాయి, దీని కారణంగా మహిళల్లో జుట్టు పెరుగుదల సమస్య ఏర్పడుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..