Sleep Without Pillow : దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

Sleep Without Pillow : దిండు లేకుండా నిద్రపోండి..! ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Sleep Without Pillow
Follow us

|

Updated on: Apr 28, 2024 | 9:28 PM

రాత్రిపూట 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని మనందరికీ తెలుసు. ఇది మన శరీర పనితీరు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. నిద్రలేమి ఉంటే, బద్ధకం, అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇలాంటి సమస్య దీర్ఘకాలంలో పెను ముప్పుగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని చిన్న అలవాట్లు మన జీవితంలో పెను మార్పును తెస్తాయి. అలాంటి అలవాటు ఒకటి ఏంటంటే.. రాత్రిపూట దిండు లేకుండా నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయంటున్నారు నిపుణులు. మీరు దిండును పూర్తిగా వదులుకోలేకపోతే, మీ దిండు సన్నగా ఉండేలా చూసుకోండి. ఇది మీకు అనేక విధాలుగా మేలు చేస్తుంది.

తప్పనిసరిగా దిండు వేసుకుని పడుకునే వారిలో కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా వస్తాయి. అందులో ముఖ్యంగా ముఖంపై మొటిమలు వస్తాయంటున్నారు నిపుణులు. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మొటిమలు రాకుండా నిరోధించవచ్చునని చెబుతున్నారు. దిండుపై పడుకున్నప్పుడు.. మీ ముఖం దిండుకు అంటుకుని ఉంటుంది. ఇది మీ ముఖంపై బ్యాక్టీరియా, మురికిని వ్యాపింపజేస్తుంది. ఇలాంటప్పుడు ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మొటిమలే కాకుండా ముఖంపై ముడతలు కూడా కలిగిస్తుంది. చర్మాన్ని సంరక్షించుకోవాలనుకునే వారు దిండు లేకుండా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మీ నిద్ర నాణ్యత మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల నిద్రలేమి వంటి నిద్ర సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉంటుంది.

మీకు కూడా దిండు వేసుకుని పడుకునే అలవాటు ఉంటే, మీ తల చాలా ఎత్తుగా కాకుండా.. చాలా చిన్న పాటి దిండును వాడుకునేలా అలవాటు చేసుకోండి. చాలా ఎత్తుగా ఉన్న దిండును వాడటం వల్ల మెడ, వెన్నెముకలో నొప్పిని భరించాల్సి వస్తుంది. మీరు దిండు లేకుండా నిద్రపోతున్నప్పుడు మీ వెన్నెముక నిటారుగా ఉంటుంది. తల కింద దింటు ఉంటే వెన్నెముక మీద ప్రభావం పడుతుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటూనే ఉండి ఉంటారు. ఒకసారి గమనించుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. మరో అదిరిపోయే ఫీచర్‌..
వాట్సాప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. మరో అదిరిపోయే ఫీచర్‌..
రోహిత్ అత్యంత చెత్త రికార్డ్‌నే బ్రేక్ చేసిన డీకే..
రోహిత్ అత్యంత చెత్త రికార్డ్‌నే బ్రేక్ చేసిన డీకే..
బ్లాక్‌ జిలేబీ తయారుచేసిన వ్యక్తి.. నీ బొందలాఉందంటూ నెటిజన్ల ఫైర్
బ్లాక్‌ జిలేబీ తయారుచేసిన వ్యక్తి.. నీ బొందలాఉందంటూ నెటిజన్ల ఫైర్
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఓటేసే వాళ్లకు ఫ్రీ రైడ్.. ర్యాపిడో ఆఫర్.. వినియోగించుకోండి.
ఆడు మగాడ్రా బుజ్జీ.! సొంత పెళ్లాం దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ..
ఆడు మగాడ్రా బుజ్జీ.! సొంత పెళ్లాం దగ్గరే డబ్బులు వసూలు చేస్తూ..
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
ఎలుగుబంట్లు చకచకా చెట్టు ఎక్కడం చూశారా.? వీడియో వైరల్..
చూడటానికి సింపుల్‌గానే ఉంది కానీ కాస్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
చూడటానికి సింపుల్‌గానే ఉంది కానీ కాస్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో
కొండలు ఎక్కి, గుట్టలు దాటొచ్చి ఓటు వేసిన గిరిజనులు.. వైరల్ వీడియో
యాపిల్ ఫోన్‌ అభిమానులకు శుభవార్త..ఐఫోన్ 16 ప్రోలో ఫీచర్స్ అదుర్స్
యాపిల్ ఫోన్‌ అభిమానులకు శుభవార్త..ఐఫోన్ 16 ప్రోలో ఫీచర్స్ అదుర్స్
ఒక్క సెకన్‌లో 5 సినిమాలు డౌన్‌లోడ్‌.. 6జీ టెక్నాలజీతో అద్భుతం.
ఒక్క సెకన్‌లో 5 సినిమాలు డౌన్‌లోడ్‌.. 6జీ టెక్నాలజీతో అద్భుతం.