కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ తయారు చేసుకోండిలా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

వేసవిలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. అయితే మీరు ఇలా కొబ్బరి నీళ్లు తాగి విసుగు చెందితే ఈ రుచికరమైన, రిఫ్రెష్ డ్రింక్ ప్రయత్నించండి.

కొబ్బరి నీళ్లతో వేసవి తాపాన్ని తీర్చే హెల్తీ కూల్‌డ్రింక్స్‌ తయారు చేసుకోండిలా.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Coconut Water Drinks
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 8:21 PM

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు కొబ్బరినీళ్లు తాగడం మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. ఇందులో ఉండే పోషకాహారం శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్యంతో పాటు చర్మానికి, జుట్టుకు కూడా కొబ్బరి నీళ్లు చాలా ఆరోగ్యకరం. ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు ఈ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల మీకు విసుగుగా అనిపిస్తుంటుందా..? అలాంటప్పుడు.. కొబ్బరి నీళ్లతో తయారు చేసుకునే కొన్ని స్పెషల్‌ డ్రింక్స్‌ ఉన్నాయి. వాటిని ఎలా తయారు చేయాలి..? అలాంటి డ్రింక్స్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వేసవిలో కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటాయి. అయితే మీరు ఇలా కొబ్బరి నీళ్లు తాగి విసుగు చెందితే ఈ రుచికరమైన, రిఫ్రెష్ డ్రింక్ ప్రయత్నించండి.

వేసవిలో కొబ్బరి నీళ్లతో తయారుచేసే టేస్టీ హెల్తీ డ్రింక్స్‌..

ఇవి కూడా చదవండి

రోజ్‌ ఎసెన్స్, కొబ్బరి నీళ్లతో.. టేస్టీ డ్రింక్‌ తయారీ కోసం కావాల్సినవి.. 2 గ్లాసుల కొబ్బరి నీరు, 2 టీస్పూన్లు రోజ్ ఎసెన్స్, 2 టీస్పూన్లు నిమ్మరసం, 1 అంగుళం అల్లం కావాలనుకుంటే సరిపడా ఐస్‌ తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానంలోకి వస్తే.. రోజ్ కోకోనట్ మొయిటో చేయడానికి ముందుగా ఒక పెద్ద జార్‌లో కొబ్బరి నీళ్ళు పోయాలి. అందులో 2 చెంచాల రోజ్ ఎసెన్స్ వేసి బ్లెండ్ చేయాలి. దీని తరువాత 2 చెంచాల నిమ్మరసం, అల్లం వేసి మళ్లీ కలపండి. అంతే, సమ్మర్ రిఫ్రెష్ డ్రింక్ సిద్ధంగా ఉంది. నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులతో సర్వ్ చేయండి.

పైనాపిల్ కోకోనట్ వాటర్ డిలైట్..

దీని తయారీ కోసం కావలసినవి – 2 కప్పులు తరిగిన పైనాపిల్, 2 గ్లాసుల కొబ్బరి నీరు, 2 టీస్పూన్లు జీలకర్ర పొడి, 1 టీస్పూన్ నిమ్మరసం, 5-6 పుదీనా ఆకులు, రుచికి తగినట్లుగా నల్ల ఉప్పు.

తయారీ విధానం..

పైనాపిల్ కోకోనట్ వాటర్ డిలైట్ చేయడానికి, ఒక గిన్నెలో కొబ్బరి నీటిని తీసుకోండి. తర్వాత బ్లెండర్‌లో పైనాపిల్‌, కొబ్బరి నీళ్లను వేసి బ్లెండ్‌ చేయాలి. ఇప్పుడు జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. దీని తరువాత, ఒక గ్లాసులో సరిపడా ఐస్ వేసి, బ్లెండ్ చేసిన డ్రింక్‌ పోసుకుని సర్వ్ చేయండి.

కివి, కొబ్బరి నీరు..

కివి, కొబ్బరినీరు కలిపి తయారు చేసుకునే డ్రింక్‌ కోసం కావలసినవి – 2 గ్లాసుల కొబ్బరి నీరు, 2 కప్పులు తరిగిన కివీ, 1 అంగుళం అల్లం, 3-4 ఐస్ క్యూబ్స్ , 2 టీస్పూన్లు చియా గింజలు తీసుకోవాలి. ఇందులో రుచి కోసం నల్ల ఉప్పును వాడుకోవాలి. ఇప్పుడు తయారీ కోసం కివి కోకోనట్ వాటర్ చేయడానికి ఒక గిన్నెలో 2 గ్లాసుల కొబ్బరి నీటిని తీసుకోండి. తర్వాత బ్లెండర్‌లో కొబ్బరి నీళ్లు, తరిగిన కివీ, కొబ్బరి క్రీం వేసి బ్లెండ్ చేయాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, బ్లాక్ సాల్ట్, ఐస్ క్యూబ్స్ వేసి మళ్లీ బ్లెండ్ చేయాలి. కివీ కొబ్బరి నీళ్ల కూల్‌డ్రింక్‌ సిద్ధంగా ఉంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సైబర్‌ క్రిమినల్స్ కొత్త అస్త్రాలు. నమ్మితే నిలువునా మునిగిపోతారు
సైబర్‌ క్రిమినల్స్ కొత్త అస్త్రాలు. నమ్మితే నిలువునా మునిగిపోతారు
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
Money Astrology: ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం!
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం 'క'.. ఎప్పుడంటే?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
బీజేపీ విషయంలో వైసీపీ వ్యూహం మారుతుందా..?
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
కేవలం రూ.90 వేలకే ఎలక్ట్రిక్‌ బైక్‌.. 175 కిలోమీటర్ల మైలేజీ..!
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
కంగువా ఎఫెక్ట్.. కోలీవుడ్‌లో కొత్త వివాదం..టాలీవుడ్‌లో ప్రకంపనలు
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
ఈ ఆలయంలో దేవుళ్ళకు కాదు రాయల్ ఎన్‌ఫీల్డ్ కి పూజలు.. ఎందుకంటే..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ..
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!