Tirumala: శ్రీ‌వారి భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. ! తిరుమలలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు.. వివరాలు ఇలా ఉన్నాయి..

మే 20న ఉదయం – మోహినీ అవతారం, అదే రోజు రాత్రి – గరుడ వాహనం, మే21న ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. మే22న ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం, మే23న ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహన సేవ ఉంటుంది. మే24న ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు టీటీడీ వివరాలు ప్రకటించింది.

Tirumala: శ్రీ‌వారి భ‌క్తుల‌కు గ‌మ‌నిక‌.. ! తిరుమలలో మే నెలలో జరిగే విశేష ఉత్సవాలు.. వివరాలు ఇలా ఉన్నాయి..
Tirumala
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 6:59 PM

తిరుమల వెళ్లే భక్తులకు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ముఖ్య గమనిక వెల్లడించింది. తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. మే నెల‌లో శ్రీ ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. శ్రీ గోవింద రాజుస్వామి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు కూడా నిర్వ‌హించ‌నున్నారు. వాటి వివ‌రాల‌ను టీటీడి ప్రకటించింది. మే 3న భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 4న‌ సర్వ ఏకాదశి, 10న అక్షయతృతీయ, 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, రామానుజ జయంతి, శంకర జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది.

మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహించనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది. మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి ఉంటుంది. మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి కార్య‌క్ర‌మాలు నిర్వహిస్తారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేది నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇక‌, ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు పరిశీలించినట్టయితే..మే16న ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – పెద్దశేష వాహనంపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది. ఇక మే 17న ఉదయం – చిన్నశేష వాహనం, అదే రోజు రాత్రి – హంస వాహన సేవ ఉంటుంది. మే 18న ఉదయం – సింహ వాహనం, రాత్రి – ముత్యపుపందిరి వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. మే 19న ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – సర్వభూపాల వాహనంపై ఊరేగుతూ శ్రీనివాసుడు భక్తులకు దర్శనమిస్తాడు. మే 20న ఉదయం – మోహినీ అవతారం, అదే రోజు రాత్రి – గరుడ వాహనం, మే21న ఉదయం – హనుమంత వాహనం, రాత్రి – గజ వాహనంపై శ్రీవారు ఊరేగుతారు. మే22న ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం, మే23న ఉదయం – రథోత్సవం, రాత్రి – అశ్వవాహన సేవ ఉంటుంది. మే24న ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం నిర్వహించనున్నట్టు టీటీడీ వివరాలు ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
2025లో రాశిని మర్చుకోనున్న బుధుడు.. ఈ రాశుల వారికి లక్కే లక్కు
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?