నారింజలో విటమిన్ ఏ,సి, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే నారింజ తొక్కల్లో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త కణాలు పుట్టేలా చేస్తుంది. చర్మంలో విష వ్యర్థాలు తొలిగేలా చేసి, స్కిన్ మెరిసేలా చేస్తుంది. నారింజ తొక్కలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడతాయి.