- Telugu News Photo Gallery Uses of Mint Leaves: Acts as a remedy for skin diseases and digestive problems
Beauty Tips: ఈ ఆకులను సంజీవనిగా చెప్పోచ్చు.. తరుచూ వాడితే పసిడివండి యవ్వనం మీ సొంతం..
నిత్యం మన చుట్టూ ఉండే కూరగాయలు, ఆకు కూరల్లో అనేక మెడిసిన్లు ఉంటాయి. ఆధునిక యుగంలో ఆకు కూరలు, కూరగాయలను తినేందుకు సుముఖం చూపకుండా అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు యువత. పుదీనా ఆకులు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది. దీని వాసన మెదడులోని నరాలను, శ్వాసనాళాలను ఉత్తేజపరుస్తుంది. దీనిని ప్రకృతి ప్రసాదించిన నిత్యం అందుబాటులో ఉండే సంజీవినీ అని చెప్పవచ్చు.
Updated on: Apr 28, 2024 | 8:30 PM

నిత్యం మన చుట్టూ ఉండే కూరగాయలు, ఆకు కూరల్లో అనేక మెడిసిన్లు ఉంటాయి. ఆధునిక యుగంలో ఆకు కూరలు, కూరగాయలను తినేందుకు సుముఖం చూపకుండా అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు యువత.

పుదీనా ఆకులు శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పని చేస్తుంది. దీని వాసన మెదడులోని నరాలను, శ్వాసనాళాలను ఉత్తేజపరుస్తుంది. దీనిని ప్రకృతి ప్రసాదించిన నిత్యం అందుబాటులో ఉండే సంజీవినీ అని చెప్పవచ్చు.

దీనిని ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో పుదీనా వాడకం మరింత ప్రయోజనకరం అంటున్నారు వైద్య నిపుణులు.

పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి–6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం వంటి మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

పుదీనా నీటిని తాగితే శరీరానికి శక్తి లభించడమే కాకుండా చర్మ సమస్యలు తగ్గుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గటానికి పుదీనాతో తయారు చేసిన లేపనం ఎంతో ఉపయోగపడుతుంది.

పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా ప్రకాశవంతంగా మారుతుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనాది ప్రత్యేక స్థానం. చర్మ సమస్యల్లో ముఖ్యంగా మొటిమలను, మచ్చలను తగ్గించడంలో పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.




