Tulsi Homemade Facepack: తులసితో తళతళలాడే అందం..! మొటిమలు, మచ్చలు మాయం చేసే అద్భుత మంత్రం ఇది ..

తులసి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మీరు తప్పక తెలుసుకోవాలి. అయితే దాని ఆకులతో చేసిన ఫేస్ ప్యాక్‌లు మీ చర్మానికి ఒక వరంలా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. తులసి ఆకులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సమస్యలను దూరం చేయడానికి ఈ ఆకులు బెస్ట్ నేచురల్ రెమెడీగా పనిచేస్తాయి. తులసిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండేలా చేస్తాయి. ఇవి చర్మంలోని మృతకణాలను తొలగిస్తాయి. చర్మం ఛాయను మెరుగుపరుస్తుంది. ఇవి మన చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి. అంతేకాకుండా, మన చర్మానికి పోషణ కూడా లభిస్తుంది. తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్‌లు మన చర్మానికి రక్త ప్రసరణను పెంచి తాజాదనాన్ని అందిస్తాయి. దీంతో చర్మం మెరుస్తూ అందంగా తయారవుతుంది. తులసి ఆకులతో తయారు చేసిన కొన్ని ఫేస్ మాస్క్‌లను తయారుచేసే పద్ధతుల గురించి తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 6:23 PM

తులసి పొడి, నిమ్మ రసం, పెరుగుతో ఫేస్ ప్యాక్: 2 టీస్పూన్ల తులసి పొడిలో 1 టీస్పూన్ నిమ్మరసం బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. దీని తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. నిమ్మకాయ నల్ల మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. తులసి చర్మానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది.

1 / 6
తులసి ఆకుల పేస్ట్, పెరుగు ఫేస్ ప్యాక్: 8-10 తులసి ఆకులను గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా పెరుగును బాగా మిక్స్ చేసి, ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. పెరుగు ఒక సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది చర్మం మీద మృత కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది.

2 / 6
తులసి, వేప నూనె ఫేస్ ప్యాక్: 2 చెంచాల తులసి పొడిలో రెండు చెంచాల వేపనూనె కలిపి ముఖానికి రాసుకుని రాత్రి నిద్రపోండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. వేపలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇవి మొటిమల సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.

3 / 6
తులసి, క్రీమ్ ఫేస్ ప్యాక్: 1 టీస్పూన్ క్రీమ్, 1 టీస్పూన్ తులసి పొడిని బాగా మిక్స్ చేసి, ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. క్రీమ్ లోపలి నుండి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది, ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.

4 / 6
తులసి, జోజోబా ఆయిల్, ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్: ఒక చెంచా తులసి ముద్దలో ఒక చెంచా ముల్తానీ మిట్టి, అర చెంచా జోజోబా నూనె మరియు రోజ్ వాటర్ మిక్స్ చేసి మీ ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. జోజోబా ఆయిల్ చర్మానికి పోషణనిస్తుంది. ముల్తానీ మిట్టి చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

5 / 6
తులసి, తేనె ఫేస్‌ప్యాక్‌:  15-20 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి అందులో 1 టీస్పూన్ తేనెను బాగా కలపండి. దీన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. తేనె చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఇది మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని తేమ చేస్తుంది.

6 / 6
Follow us