- Telugu News Photo Gallery Cinema photos Priyanka Jawalkar Shares Latest Stunning Photos Goes Viral telugu movie news
Priyanka Jawalkar: బాబోయ్.. ఈ బ్యూటీ ఇలా మారిపోయిందేంటీ ?.. స్టన్నింగ్ లుక్స్‌తో మతిపోగొడుతున్న ప్రియాంక..
హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అభిమానులకు షాకిచ్చింది. ఇన్నాళ్లు అందమైన ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్స్ ఎత్తేసింది. స్టన్నింగ్ లుక్స్ తో మైండ్ బ్లాంక్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. లేటేస్ట్ స్టైలీష్ డ్రెసింగ్..
Updated on: Apr 28, 2024 | 9:13 PM

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ అభిమానులకు షాకిచ్చింది. ఇన్నాళ్లు అందమైన ట్రెడిషనల్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట సందడి చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్స్ ఎత్తేసింది. స్టన్నింగ్ లుక్స్ తో మైండ్ బ్లాంక్ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. లేటేస్ట్ స్టైలీష్ డ్రెసింగ్.. ఉంగరాల జుట్టుతో కట్టిపడేస్తోంది. ఇటీవలే సిద్దూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ సినిమాలో మెరిసింది.

ప్రియాంక జవాల్కర్ 2017లో కలవరమయే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అయితే ఈ సినిమా ఈ ముద్దుగుమ్మకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా సినిమాలో మెరిసింది.

టాక్సీవాలా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక. దీంతో ఈ అమ్మడుకు ఎక్కువే ఆఫర్స్ వస్తాయనుకున్నారంతా కానీ.. ఆశించిన స్తాయిలో ఈ బ్యూటీకి ఆఫర్స్ మాత్రం రాలేదు.

చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న ముద్దుగుమ్మ ఇటీవలే టిల్లు స్క్వేర్ సినిమాలో కనిపించింది. అటు సినిమాల్లో కనిపించని ఈ అందాల తార నెట్టింట మాత్రం నిత్యం సందడి చేస్తుంది.




