నెలల పసికందు బాల్కనీ నుంచి జారీ ఇలా మధ్యలో చిక్కుకుపోయాడు..! ఆపై నరాలు తెగే ఉత్కంఠ.. చివరకు

వీడియోలో ఒక చిన్నారి ప్లాస్టిక్ షీట్ మీదపడి నెమ్మదిగా కిందకు జారిపడిపోవడం కనిపించింది. మొదట్లో చిన్నపాటి బెడ్‌షీట్‌ను పిల్లవాడు కిందపడతాడనుకునే చోట ఏర్పాటు చేశారు స్థానికులు.  ఆ తరువాత మరో పెద్ద బెడ్‌షీట్‌ వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఇంతలో మొదటి అంతస్తులో ఉన్న వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించారు.

నెలల పసికందు బాల్కనీ నుంచి జారీ ఇలా మధ్యలో చిక్కుకుపోయాడు..! ఆపై నరాలు తెగే ఉత్కంఠ.. చివరకు
Child
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 28, 2024 | 9:01 PM

తమిళనాడులోని చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన నిజంగానే కాళ్లు, చేతులు వణికిపోయేలా చేసింది. ఒళ్లు గగ్గర్పొడిచే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక నెలల పసిబిడ్డ రెండవ అంతస్తు నుండి కింద పడబోతున్నాడు. అయితే అప్పుడు ఒక ‘అద్భుతం’ జరిగింది. అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణం రక్షించబడింది. ఈ వీడియో చూసిన వారు కొన్ని నిమిషాల పాటు రెప్పవేయకుండా టెన్షన్‌లో పడ్డారు. పిల్లవాడు బాల్కనీ లోంచి ప్లాస్టిక్ షీట్‌పై పడిపోయాడు. మెల్లగా కిందకు జారుతున్నాడు. దాంతో చుట్టుపక్కల వారు భయంతో గగ్గొలు పెడుతున్నారు. చిన్నారిని ఎలాగైనా రక్షించాలంటూ హాహకారాలు చేస్తున్నారు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు అతని ప్రాణాలను కాపాడేందుకు పెద్ద సంఖ్యలో కింద గుమిగూడారు. చిన్నారి పడిపోతే కాపాడేందుకు వీలుగా ఒక షీట్ కూడా కిందకు దించారు. అయితే, ఈ సమయంలో మొదటి అంతస్తులోని కొందరు వ్యక్తులు చిన్నారిని సురక్షితంగా కాపాడారు.

అపార్ట్‌మెంట్ ముందున్న టవర్‌పై నుంచి తీసిన వీడియో ఇది. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చిన్నారిని ఎలా కాపాడారో క్లీయర్‌గా కనిపించింది. వీడియోలో ఒక చిన్నారి ప్లాస్టిక్ షీట్ మీదపడి నెమ్మదిగా కిందకు జారిపడిపోవడం కనిపించింది. మొదట్లో చిన్నపాటి బెడ్‌షీట్‌ను పిల్లవాడు కిందపడతాడనుకునే చోట ఏర్పాటు చేశారు స్థానికులు.  ఆ తరువాత మరో పెద్ద బెడ్‌షీట్‌ వేసి పట్టుకునే ప్రయత్నం చేశారు.. ఇంతలో మొదటి అంతస్తులో ఉన్న వ్యక్తులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక ఇద్దరు వ్యక్తులు చాకచక్యంగా వ్యవహరించారు. కిటికీ గుండా బయటకు వచ్చి.. పిల్లవాడిని నెమ్మదిగా కిందకు తీసుకునే ప్రయత్నం చేశారు..చిన్నారి కిందపడకుండా జాగ్రత్తగా పట్టి కిందకు తీసుకున్నాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ప్రమాదవశాత్తు బల్కానీ నుంచి కిందపడిపోయిన చిన్నారి ప్లాస్టిక్ షీట్‌పై పడ్డాడు..అక్కడ్నుంచి కిందకు జారుతున్నాడు.. ఇంతలో సమీపంలో ఉన్నవారు ఇది చూసి షాక్‌కు గురయ్యారు. చిన్నారి పరిస్థితి చూస్తూ వారందరికీ ఊపిరి ఆగిపోయినంత పనైంది. అలాంటి ప్రమాదకర పరిస్థితి నుండి చిన్నారి సురక్షితంగా బయటపడటంతో స్థానికులంతా సంతోషం వ్యక్తం చేశారు. వీడియో చూసిన తర్వాత, సోషల్ మీడియా వినియోగదారులు కూడా చిన్నారి ప్రాణాలతో బయటపడినందుకు హామ్మయ్యా అనుకుంటున్నారు. నేను దీన్ని చూడలేను నాకు హార్ట్‌ఎటాక్‌ వచ్చినంత పనైంది అంటూ ఒక వినియోగదారు చెప్పారు. రక్షించిన వ్యక్తికి ధన్యవాదాలు అంటున్నారు. అదే సమయంలో పిల్లవాడిని అలా వదిలేసి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!