Noise Pollution: నిశ్శబ్దంగా ప్రాణాలు తీసేస్తున్న శబ్ద కాలుష్యం.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోందని ఆందోళన

ఈ రోజు రోజుకీ శబ్ద కాలుష్యం పర్యావరణ నాణ్యతకే కాదు, మానవుని జీవన ప్రమాణానికి  తీవ్ర ముప్పుగా మారింది. శబ్ద కాలుష్యం ప్రస్తుతం చాలా ప్రాణాంతకంగా మారింది. నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్ర పోయే వరకూ శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రణగొణ ధ్వనులు చెవులకు చిల్లులు పడేలా ఉండడంతో శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర అశాంతికి గురవుతున్నారు. శబ్ధం స్థాయి పెరిగితే, వినికిడి సామర్థ్యం తగ్గుతుంది.. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది.

Noise Pollution: నిశ్శబ్దంగా ప్రాణాలు తీసేస్తున్న శబ్ద కాలుష్యం.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతోందని ఆందోళన
Noise Pollution
Follow us

|

Updated on: Apr 29, 2024 | 8:33 AM

కాలుష్యం ప్రకృతి, పర్యావరణానికి మాత్రమే కాదు మానవులకు కూడా తీవ్ర హానిని కలిస్తుంది.ఈ కాలుష్యంలో  వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం, ధ్వని కాలుష్యం వంటి అనేక రకాలున్నాయి. ఈ రోజు రోజుకీ శబ్ద కాలుష్యం పర్యావరణ నాణ్యతకే కాదు, మానవుని జీవన ప్రమాణానికి  తీవ్ర ముప్పుగా మారింది. శబ్ద కాలుష్యం ప్రస్తుతం చాలా ప్రాణాంతకంగా మారింది. నిద్రలేచింది మొదలు, రాత్రి నిద్ర పోయే వరకూ శబ్ద కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రణగొణ ధ్వనులు చెవులకు చిల్లులు పడేలా ఉండడంతో శబ్ద కాలుష్యంతో ప్రజలు తీవ్ర అశాంతికి గురవుతున్నారు. శబ్ధం స్థాయి పెరిగితే, వినికిడి సామర్థ్యం తగ్గుతుంది.. మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. అంతేకాదు రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సందడి కారణంగా గుండెపోటుతో పాటు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువైందని తాజా అధ్యయనంలో రుజువైంది.

  1. వాహన శబ్దాన్ని గుండె జబ్బుల ప్రమాదంతో ముడిపెట్టే అనేక సాక్ష్యాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ రకమైన శబ్ద కాలుష్యం గుండె రోగులకు ప్రమాద కారకంగా మారాయని వెల్లడించారు.
  2. అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఒక నిర్దిష్ట వ్యాధికి ప్రమాద కారకాలను గుర్తించడానికి సాక్ష్యాలను అందించే ఎపిడెమియోలాజికల్ డేటాను సమీక్షించింది.
  3. రోడ్డు ట్రాఫిక్ శబ్దంలో ప్రతి 10 డెసిబెల్ పెరుగుదలతో మధుమేహం, గుండెపోటుతో సహా ఇతర హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం 3.2 శాతం పెరుగుతుందని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు వెల్లడించారు.
  4. ముఖ్యంగా రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే ట్రాఫిక్ శబ్దం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడికి కారణమయ్యే హార్మోన్ల స్థాయిలు పెరిగి అధిక రక్తపోటు, రక్తనాళాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.
  5. ఇవి కూడా చదవండి
  6. వాహన శబ్దం గుండె జబ్బులకు ప్రమాద కారకంగా మారిందని ఇప్పుడు బలమైన సాక్ష్యం లభించిందని జర్మనీలోని యూనివర్సిటీ మెడికల్ సెంటర్ మెయిన్జ్‌లోని సీనియర్ ప్రొఫెసర్, సర్క్యులేషన్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనానికి ప్రధాన రచయిత థామస్ ముంజెల్ అన్నారు. తమ పరిశోధన గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
  7. రోడ్డు, రైలు, విమాన ట్రాఫిక్ నుంచి శబ్దాన్ని తగ్గించడానికి స్థానిక అధికారులు అనుసరించాల్సిన కొన్ని వ్యూహాలను కూడా పరిశోధకులు సూచించారు.
  8. జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో రద్దీగా ఉండే రోడ్లపై నాయిస్ బారియర్స్ ఏర్పాటు చేయడం ద్వారా 10 డెసిబుల్స్ శబ్దాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
  9. శబ్దాన్ని తగ్గించే తారును ఉపయోగించి రోడ్లను నిర్మించడం వల్ల శబ్దం స్థాయిని మూడు నుంచి ఆరు డెసిబుల్స్ తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.
  10. అంతేకాదు డ్రైవింగ్ వేగాన్ని పరిమితం చేయాలని, తక్కువ శబ్దం ఉన్న టైర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
పూరన్ పోరాటం వృథా.. పోరాడి ఓడిన లక్నో.. ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా..?
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
ఆసీస్ బీచుల్లో రష్మిక ఫొటో షూట్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే!
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
రసాయనాలు లేకుండా రెండ్రోజుల్లోనే పచ్చి అరటిగెల పండింది..?!ఎలాగంటే
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
బాలీవుడ్‏లోకి తెలుగమ్మాయి.. ఊహించని పాత్రలో అనన్య..
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
ఒక నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా..?
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
అదరగొట్టిన అభిషేక్.. ఆఖరులో స్టబ్స్ మెరుపులు.. ఢిల్లీ భారీ స్కోరు
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
ఒక్కసారి కట్టిన చీరను మళ్లీ ముట్టని హీరోయిన్..
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
లక్నో ఓనర్ ఇంట్లో కేఎల్ రాహుల్‌ డిన్నర్.. అతియా శెట్టి ఏమందంటే?
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు
రాత్రి మిగిలిన చపాతీ పడేస్తున్నారా..?లాభాలు తెలిస్తేఆశ్చర్యపోతారు