Green Tea Bag: వాడేసిన టీ బ్యాగ్స్​ని పడేస్తున్నారా..? ఇలా వాడితే బోలేడన్నీ లాభాలు..!

చాలా మంది గ్రీన్ టీ తాగడానికి టీ బ్యాగ్ లను వాడుతుంటారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మంచి ఫిట్‌నెస్‌కు సహకరిస్తుంది. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కానీ, మనం వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌లను బ్యాగ్‌లను పారేసే బదులు, మీరు వాటిని ఈ స్మార్ట్ మార్గాల్లో ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Green Tea Bag: వాడేసిన టీ బ్యాగ్స్​ని పడేస్తున్నారా..? ఇలా వాడితే బోలేడన్నీ లాభాలు..!
Green Tea Bag
Follow us

|

Updated on: Apr 29, 2024 | 9:41 AM

గ్రీన్ టీ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్ల పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. రోజూ ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే జీవక్రియ వ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుంది. మహిళలు 40 ఏళ్ల తర్వాత తప్పనిసరిగా గ్రీన్ టీ తాగాలి. ఇది వారి జీవక్రియను సరిచేస్తుంది. ఇది మహిళల్లో కనిపించే పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా మంది గ్రీన్ టీ తాగడానికి టీ బ్యాగ్ లను వాడుతుంటారు. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది. మంచి ఫిట్‌నెస్‌కు సహకరిస్తుంది. ఇందులో లభించే పోషకాలు శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. కానీ, మనం వాడిన గ్రీన్ టీ బ్యాగ్‌లను బ్యాగ్‌లను పారేసే బదులు, మీరు వాటిని ఈ స్మార్ట్ మార్గాల్లో ఉపయోగించవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

ఊబకాయాన్ని దూరం చేయడంలో గ్రీన్ టీ ఎంతగానో సహకరిస్తుంది. ఫిట్‌నెస్ నిపుణులు కూడా గ్రీన్‌టీ తాగాలని సూచిస్తున్నారు. కానీ, ప్రజలు గ్రీన్ టీ బ్యాగ్‌లను తాగిన తర్వాత పారేస్తారు. మీరు కూడా గ్రీన్‌ టీ ఉపయోగిస్తున్నట్టయితే దాని ఉపయోగాలు తెలిస్తే అస్సలు విసిరేయరు. ఇందుకోసం మీరు గ్రీన్ టీ బ్యాగ్ తీసి ఎండలో ఆరబెట్టి ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని మీ ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇది మొక్కలకు మంచి పోషణను అందిస్తుంది.

గ్రీన్ టీ బ్యాగ్ మీ ఆరోగ్యానికి అలాగే మీ జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి మీ జుట్టు మెరుపును పెంచడంలో కూడా సహాయపడతాయి. టీ బ్యాగ్‌ను 1 గ్లాసు నీటిలో మరిగించి, ఆపై చల్లటి నీటిలో కలపండి, ఆ తర్వాత మీరు ఈ నీటితో మీ జుట్టును కడగవచ్చు. ఇది జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం వల్ల చర్మాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఇది ముఖానికి సంబంధించిన సమస్యలను తొలగించడంలో చాలా సహాయపడుతుంది. మీ చర్మానికి ఉపశమనం కలిగించడానికి తోడ్పడుతుంది. మీకు కావాలంటే, మీరు టీ బ్యాగ్‌లను తిరిగి ఉపయోగించుకోవచ్చు. అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఇవి మీకు చాలా సహాయపడతాయి. మీ కళ్ల కింద నల్లటి వలయాలు, ఎరుపు, వాపు వంటి సమస్యలను వదిలించుకోవడానికి ఇది తోడ్పడుతుంది. శరీరం నుండి చెమట వాసన వస్తే గ్రీన్ టీ ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీటిలో గ్రీన్‌ టీ వాడండి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. చెమట వాసన పోతుంది.

నాన్‌స్టిక్‌ పాన్‌లో నూనె పేరుకుపోయి ఉంటేగ్రీన్ టీ బ్యాగ్‌తో శుభ్రం చేసుకోవటం ఈజీ. గ్రీన్ టీ బ్యాగ్‌లను జిడ్డుగల పాన్‌లో వేసి అందులో వేడి నీటిని నింపాలి. దాన్ని రాత్రంతా అలాగే వదిలివేయండి. ఉదయాన్నే పాన్‌ను పట్టిన జిడ్డును సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. దర్శకుడు ఎవరంటే..
విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. దర్శకుడు ఎవరంటే..
బిల్ గేట్స్ తన పిల్లలకు 14 ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదు.. కారణం
బిల్ గేట్స్ తన పిల్లలకు 14 ఏళ్లుగా స్మార్ట్‌ఫోన్ ఇవ్వలేదు.. కారణం
బెంగుళూరు తరువాత నీటి సంక్షోభం ఎదుర్కుంటున్న నగరం అదే..
బెంగుళూరు తరువాత నీటి సంక్షోభం ఎదుర్కుంటున్న నగరం అదే..
కీరదోస వాటర్‌ ఇలా తాగితే పొట్ట చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది
కీరదోస వాటర్‌ ఇలా తాగితే పొట్ట చుట్టూ కొవ్వు మంచులా కరిగిపోతుంది
అనామికను 'ఉంటే ఉండు పోతే పో' అన్న కళ్యాణ్.. కావ్య కిడ్నాప్!
అనామికను 'ఉంటే ఉండు పోతే పో' అన్న కళ్యాణ్.. కావ్య కిడ్నాప్!
ఈ సమస్యలున్న వారు దానిమ్మ పండును తినకూడదంట..! అవేంటంటే..?
ఈ సమస్యలున్న వారు దానిమ్మ పండును తినకూడదంట..! అవేంటంటే..?
అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!
అమ్మబాబోయ్.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..!
తీవ్ర వాతావరణ పరిస్థితులు.. వైపరీత్యాలు.. భారత్‌లో ఇక నిత్యకృత్యం
తీవ్ర వాతావరణ పరిస్థితులు.. వైపరీత్యాలు.. భారత్‌లో ఇక నిత్యకృత్యం
టెంప్టింగ్ ఆఫర్.! రూ. 14 లక్షల SUV కారు కేవలం రూ. 6.5 లక్షలకే..
టెంప్టింగ్ ఆఫర్.! రూ. 14 లక్షల SUV కారు కేవలం రూ. 6.5 లక్షలకే..
వీటిని తింటే సర్జరీ లేకుండానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్‌
వీటిని తింటే సర్జరీ లేకుండానే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయ్‌